లారీని ఢీ కొట్టిన బైక్-ఇద్దరు వ్యక్తులు మృతి
లారీని ఢీ కొట్టిన బైక్-ఇద్దరు వ్యక్తులు మృతి
దమ్మపేట, శోధన న్యూస్ : ఎదురుగా ఉన్న లారీని ఢీకొట్టడంతో ఇద్దరు బైక్ మీద ఉన్న వ్యక్తులు మృతి చెందిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. దీనిపై పోలీసులు పేర్కొన్న వివరాలు ప్రకారం సత్తుపల్లి మండలం గుడిపాడుకు చెందిన బేతి వెంకటేశ్వరరావు కుమారుడు నాగేంద్రరావు(30) మండలంలోని పెద్ద గొల్లగూడెంలో తాపీ పని చేస్తూ అక్కడే నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో బైక్ పై నాగేంద్ర తో పాటుగా మిత్రుడు రావుల శ్రీను(30) కలిసి వెళుతుండగా ఎదరగా ఆపి ఉన్న చెరుకు లారీని బైక్ పై వెళుతున్న ఇరువురు ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు.