వంధ్యత్వ సమస్య అధిగమించాలి : డాక్టర్ వి కీర్తన
వంధ్యత్వ సమస్య అధిగమించాలి : డాక్టర్ వి కీర్తన
హైదరాబాద్, శోధన న్యూస్ : వంధ్యత్వ సమస్యను జంటలు అధిగమించాల్సిన అవసరం ఉందని ఒయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ వీ కీర్తన తెలిపారు.ఒయాసిస్ ఫెర్టిలిటీలో ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చిన తల్లులందరినీ మంగళవారం సత్కరించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారతదేశంలో 28 మిలియన్లకు పైగా జంటలు వంధ్యత్వ సమస్యను కలిగి ఉన్నారన్నారు.వీరిలో మూడు శాతం మంది మాత్రమే సంతానోత్పత్తి సహాయాన్ని తీసుకుంటున్నారని పేర్కొన్నారు.భయాల నుంచి బయటపడాలన్నారు. సమస్యను అధిగమించడానికి సంతానోత్పత్తి నిపుణుల సహాయం తీసుకోవాలన్నారు. అవగాహన అత్యంత ఆవశ్యకమన్నారు. ఈ వేడుకలలో పాల్గొనడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందన్నారు. కాబోయే తల్లులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.తమ నైపుణ్యం,నిబద్ధతతో ఈ సంవత్సరం చాలా మంది జీవితాలకు తల్లిదండ్రుల ఆనందాన్ని అందించగలిగామని వివరించారు.అధునాతన చికిత్సలు అందుబాటులో ఉన్నప్పటికీ చాలా మంది దంపతులకు టెక్నాలజీపై అవగాహన లేదన్నారు.దీంతో చాలా మంది ఆశను వదులుకుంటున్నారని చెప్పారు.పీజీటీ (ప్రీ-ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్) అనేది ఒక అధునాతన సాంకేతికత అన్నారు. ఇది ఐవీఎఫ్ లో గర్భస్రావం ప్రమాదాన్ని తగ్గిస్తుందన్నారు. ఎస్ఈటీ (సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్) చేస్తామన్నారు. దీనిలో ఒక పిండం మాత్రమే స్త్రీ గర్భాశయంలోకి బదిలీ చేయనున్నామన్నారు. తద్వారా బహుళ గర్భాలు తగ్గుతాయన్నారు. ఏ జంటైనా ఒక సంవత్సరం తర్వాత గర్భం దాల్చకపోతే సంతానోత్పత్తి నిపుణుడిని సంప్రదించడం చాలా ముఖ్యమన్నారు.తమ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.