తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే – కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పోదెం వీరయ్య

వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే

– కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పోదెం వీరయ్య

చర్ల, శోధన న్యూస్ : వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని,  రానున్న  కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ ఉద్యమకారులకు పెద్దపీట వేయనున్నట్లు భద్రాచలం ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోదెం వీరయ్య వెల్లడించారు.తెలంగాణ రాష్ట్ర సాధనలో బిఆర్ఎస్ పార్టీలో కీలక పాత్ర పోషించిన మండలానికి చెందిన తెలంగాణ ఉద్యమకారులు గురువారం ఎమ్మెల్యే పొదెం వీరయ్య సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికీ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోదెం వీరయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం1200 మంది విద్యార్థులు బలిదానం చేశారని, అనేకమంది తెలంగాణ ఉద్యమకారులు తమ జీవితాలను పణంగా పెట్టి ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కృషి చేశారని, కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టగానే ఉద్యమకారులను మరచి, తెలంగాణ వ్యతిరేకులకు తమ ప్రభుత్వం లో పెద్దపీట వేశారని విమర్శించారు.ఈనెల 30న జరగబోవు అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అఖండ మెజార్టీతో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నదని ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, నాలుగువేల రూపాయల పింఛన్ సౌకర్యం కల్పించనున్నట్లు వెల్లడించారు.పార్టీలో చేరిన ఉద్యమకారులలో పార్టీ మాజీ మండల అధ్యక్షులు పటెల్ వెంకటేశ్వర్లు, ఉద్యమకారుడు, మైనార్టీ నాయకుడు మహబూబ్ పఠాన్ ఖాన్,జిల్లా ముస్లిం మైనారిటీ ఉపాధ్యక్షులు ఎస్డి యాకూబ్,బిఆర్ఎస్ నాయకులు తాండవ రాయుడు, పాసిగంటి సంతోష్,సంతపురి రఘు, పుప్పాల లోహిత్, భాను ప్రకాష్, గుడికందుల సుమన్, బిజెపి పార్టీ చర్ల మండల అధ్యక్షులు ఎస్డి మొహిద్దిన్ ఉన్నారు.ఈ కార్యక్రమంలో టిపిసిసి సభ్యులు నల్లపు దుర్గాప్రసాద్, చర్ల పిఎసిఎస్ అధ్యక్షులు, డిసిసిబి డైరెక్టర్ పరుచూరి రవికుమార్, పార్టీ సీనియర్ నాయకులు చీమలమర్రి మురళీకృష్ణ, చర్ల మేజర్ గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ సిరిపురం శివ,సుందరి సురేష్, తోటమల్ల వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *