తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే

వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే
– మూడోసారి కేసీఆర్ సీఎం కావడం ఖాయం
-పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు
అశ్వారావుపేట ,నవంబర్7( ప్రభ న్యూస్): రానున్న ఎన్నికలలో వచ్చేది టిఆర్ఎస్ ప్రభుత్వం అని సీఎం గా మూడోసారి కెసిఆర్ అవడం ఖాయం అని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. అశ్వారావుపేట లో జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే, అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు తో కలసి మాట్లాడిన ఎంపీ నామ నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి , సీఎం కేసీఆర్ కు ప్రజలు మద్దతుగా నిలిచి బ్రహ్మరథం పడుతు న్నారని బీఆర్ఎస్ లోక్ సభ పక్ష నాయకులు ,ఖమ్మం పార్లమెంటు సభ్యులు నామ నాగేశ్వరరావు అన్నారు. అశ్వారావుపేటలో మంగళవారం స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు తో కలసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎంపీ నామ ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు ప్రవేశపెట్టి, విజయవంతంగా అమలు చేసిన ఘనత కెసిఆర్ కి దక్కుతుందన్నారు. రైతు బంధు పథకం పెట్టి 73 వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేయడం ఒక చరిత్ర అన్నారు. దాదాపు రైతులకు సంబంధించి వివిధ పథకాల కింద లక్ష కోట్ల వరకు ఖర్చు చేశారని చెప్పారు.
యావత్ రైతాంగం మొత్తం కెసిఆర్ కు అండగా ఉందన్నారు. అనేక సంక్షేమ పథకాల ద్వారా రైతు రాజ్యాన్ని సాకారం చేశారని తెలిపారు.  బీఆర్ఎస్ మేనిఫెస్టో బ్రహ్మాండంగా ఉందని, మూడోసారి ప్రభుత్వం ఏర్పడగానే దానిని ఘనంగా అమలు చేసుకుందామని చెప్పారు. రాష్ట్రంలో విద్య, వైద్యం అభివృద్ధికి పెద్దపీట వేశారని తెలిపారు. పార్లమెంట్లో ఎన్నడూ తెలంగాణ గురించి, తెలంగాణ ప్రజల సమస్యల గురించి, తెలంగాణ ప్రజల బాగోగులు గురించి ఏనాడు మాట్లాడని రాహుల్ గాంధీ ఈరోజు ఇక్కడకు వచ్చి అవాకులు చవాకులు పేలుతూ పచ్చి, అబద్దాలు మాట్లాతున్నారని అన్నారు. పార్లమెంట్లో వ్యవసాయ బిల్లును అడ్డుకున్నానని రాహుల్ చెప్పడం విడ్డూరంగా ఉందని , అసలు ఆయన పార్లమెంట్ కే రాలేదని తెలిపారు . కాంగ్రెస్ పార్టీని తెలంగాణ నుంచి పారదోలాలని పిలుపు నిచ్చారు. త్వరలో జరిగే అశ్వారావుపేట ప్రజా ఆశీర్వాద సభ కు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని నామ విజ్ఞప్తి చేశారు. రైతుబిడ్డగా రైతుల సమస్యలు దగ్గరగా చూశానని.. నీళ్లు , కరెంట్, పెట్టుబడి లేక అప్పులు చేసి రైతులు ఆత్మహత్య చేసుకున్న చరిత్ర గతంలో ఉండేదని , కెసిఆర్ వచ్చిన తర్వాత పరిస్థితి బాగుపడిందన్నారు. రైతు సంక్షేమ రాజ్యం తీసుకు వచ్చారని తెలిపారు. దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా లేని  రైతు సంక్షేమ పథకాలు తెలంగాణలో ప్రవేశపెట్టడం జరిగిందని ఆయన తెలిపారు. సీఎం కేసీఆర్ పామాయిల్ సాగు ప్రధమ ప్రాధాన్యత ఇచ్చి అన్ని విధాల ఆదుకుంటామన్నారు. రానున్న కాలంలో 10 లక్షల ఎకరాల్లో పక్కా ప్రణాళికతో పామాయిల్ సాగుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు .అందులో భాగంగా పది పన్నెండు పామాయిల్ ఫ్యాక్టరీలకు శంకుస్థాపన చేయడం జరిగిందని ఆయన తెలిపారు. రానున్న ఎన్నికల్లో మెచ్చా నాగేశ్వరరావు ను మంచి మెజార్టీతో గెలిపించి, అసెంబ్లీకి పంపించాలని నామ ఓటర్లకు విజ్ణప్తి చేశారు. ఈ సమావేశంలో స్థానిక శాసనసభ్యులు మచ్చ నాగేశ్వరరావు, నియోజకవర్గ ఇన్చార్జి ఉప్పల వెంకటరమణ,జిల్లా రైతుబంధు సమితి కన్వీనర్ దమ్మపేట సొసైటీ చైర్మన్ రావు జోగేశ్వరరావు, ఎంపిపి జల్లిపల్లి శ్రీరామ్మూర్తి, ఉపాధ్యాయుల సూర్యప్రకాష్ రావు, జూపల్లి రమణారావు, కోటగిరి సీతారామస్వామి, సత్యవరపు సంపూర్ణ, బిర్రం వెంకటేశ్వరరావు, మోటూరి మోహన్, కలపాల శ్రీనివాసరావు, మందపాటి రాజమోహన్ రెడ్డి, తాడేపల్లి రవి, కాసాని చంద్రమోహన్, సంకా ప్రసాదరావు, వైస్ ఎంపీపీ ఫణీంద్ర, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *