వర్షాన్ని సైతం లెక్క చేయక… జోరుగా మెచ్చా నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారం
వర్షాన్ని సైతం లెక్క చేయక…
జోరుగా మెచ్చా నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారం
అశ్వారావుపేట, శోధన న్యూస్ : వర్షాన్ని సైతం లెక్క చేయకుండా అశ్వారావుపేట నియోజకవర్గ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ది మెచ్చా నాగేశ్వరరావు గురువారంములకలపల్లి మండలంలో ని సితాయిగూడెం, కమలాపురం, గుట్టగూడెం, చాపరాలపల్లి, రామచంద్రపురం, గుట్టగూడెం పంచాయతీల్లో జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వర్షం పడుతున్నా…లెక్క చేయకుండా ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యే కి గ్రామస్థులు స్వాగతం పలికారు. ప్రచారంలో భాగంగా సితాయిగూడెం మాజీ సర్పంచ్ బిఆర్ఎస్ పార్టీలో చేరారు.ఈ ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు , జెడ్పీటీసి సున్నం నాగమణి, భూక్యా ప్రసాద్, వగ్గెల పూజ తదితరులు పాల్గొన్నారు.