వాకర్స్ ను కలిసిన ఎమ్మెల్యే సండ్ర
వాకర్స్ ను కలిసిన ఎమ్మెల్యే సండ్ర
సత్తుపల్లి, శోధన న్యూస్ : ఎన్నికల ప్రచారంలో భాగంగా భారత రాష్ట్ర సమితి సత్తుపల్లి నియోజకవర్గం సండ్ర వెంకట వీరయ్య ఉదయాన్నే ప్రభుత్వం జలగం వెంగళరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వాకర్సును కలసి భారత రాష్ట్ర సమితి అభ్యర్థిని అభ్యర్థనైన తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.అనంతరం వాకర్స్ తో మాట్లాడుతూ డిగ్రీ కళాశాల గ్రౌండ్లో వాకింగ్, జాగింగ్ ,సైక్లింగ్ కు అ నువుగా ఉందా అంటూ వారిని అడిగి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. పట్టణంలోని పలు టి స్టాల్స్, హోటల్లు దగ్గర ఉన్న ఉన్న ప్రజలను కలుసుకొని కారు గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్, ఆత్మ కమిటీ చైర్మన్ వనమా వాసు ,కౌన్సిలర్ చాంద్ పాషా, బిఆర్ఎస్ నాయకులు వల్లభనేని పవన్, పట్టణ కార్యదర్శి మల్లూరు అంకమరాజు, పట్టణ అధ్యక్షుడు రఫీ తదితరులు పాల్గొన్నారు.