వాహన తనిఖీల్లో రూ.70.వేల నగదు సీజ్
వాహన తనిఖీల్లో రూ.70.వేల నగదు సీజ్
ఏన్కూరు, శోధన న్యూస్: తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో భాగంగా మండల కేంద్రమైన ఏన్కూ రులోని రహదారిపై ఎస్ఐ బాదావత్తు రవి తన సిబ్బందితో కలిసి ముమ్మరంగా వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమం లో నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్న రూ.70. వేల నగదును స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ బాదావత్తు రవి మాట్లాడుతూ..కొత్తగూడెం నుండి కారులో ఖమ్మం వైపు వె ళుతుండగా వాహనంలో ఎలాంటి అనుమతులు లేకుండా రూ.70.వేల నగదును తరిలిస్తున్నారని, వాహన తనిఖీలో భాగంగా ఆ నగదును పోలీసులు పట్టుకున్నారు. ఎన్నికల కోడ్ అమ లులో ఉన్నందున 50.వేల రూపాయలు కన్నా డబ్బులు ఎక్కువగా ఉంటే సరియైన ధ్రువపత్రాలు సమర్పించి తీసుకువెళ్లాలని,ఎలాంటి ఆధారాలు లేకుండా పట్టుబడిన రూపాయలు ఎలక్షన్ కోడ్ అయిపోయాక మాత్రమే తిరిగి ఇస్తామని ఆయన తెలిపారు.ఈ నగదు మొత్తం ఖమ్మం రిటర్నింగ్ అధికారికి పంపనున్నట్లు ఎస్ఐ బా దావత్తు రవి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల చెక్ పోస్ట్ అధికారి ప్రవీణ్, ఎస్ఐ బాదావత్తు రవి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.