విజయ కళాశాలలో ఘనంగా ప్రెషర్స్ డే కార్యక్రమం
విజయాలో ఘనంగా ప్రెషర్స్ డే కార్యక్రమం
కొణిజర్ల, శోధన న్యూస్ : మండలంలోని విజయ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రసర్స్ డే వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాలలో కొత్తగా 20 23 24 సంవత్సరానికి గానునూతనంగా జాయిన్ అయిన విద్యార్థులకు స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కళాశాల చైర్మన్ ముళ్ళపూడి ఉషా కిరణ్ కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాల జీవితం చాలా విలువైనదని, నాలుగు సంవత్సరాలు కష్టపడి చదివితే 40 సంవత్సరాలు భవిష్యత్తుని ఆనందంగా గడపవచ్చు అని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులు కళాశాలలో ఉన్న అన్ని వసతులను ముఖ్యంగా కళాశాలకు రెగ్యులర్ గా వచ్చి తరగతిలో అటెండ్ అయ్యి సద్వినియోగం చేసుకోవాలని, మంచి విద్యను అభ్యసించి మంచి ఉద్యోగాలతో మధురమైన జ్ఞాపకాలతో బయటకు వెళ్లాలని ఆకాంక్షించారు. అనంతరం ఫైనలియర్ స్టూడెంట్స్ లైవ్ ప్రాజెక్టులో భాగంగా విజయ మొబైల్ యాప్ ని మరియు ఖమ్మం 360 డిగ్రీస్ యాపులతో కూడిన పోస్టర్ని రిలీజ్ చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జానుబాబు మాట్లాడుతూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఆర్గనైజేషన్ చేసిన సీనియర్ విద్యార్థులను అభినందించారు. సీనియర్ జూనియర్ మధ్య స్నేహపూర్వకమైన వాతావరణాన్ని నెలకొల్పటానికి ఈ వేదిక ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. విద్యార్థులు జూనియర్ సీనియర్ అనే ఉద్దేశం లేకుండా కలిసిమెలిసి చదువుకొని కళాశాలకు తమ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థుల సంస్కృతిక కార్యక్రమాలతో డ్యాన్సులు ఆటపాటలతో అలరించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వి చిన్నయ్య డీన్ డాక్టర్ శ్రీనివాస్ డైరెక్టర్ ట్రైనింగ్ ఇన్ ప్లేస్మెంట్ డాక్టర్ అయోష తరుణం డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ డాక్టర్ ఫరీద్ బాబా ఫస్టియర్ హెచ్వైడి డాక్టర్ పి హరి ప్రసాద్ వివిధ విభాగాలు అధిపతులు ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ విద్యార్థులు పాల్గొన్నారు.