విజిలెన్స్ అవగాహన వారోత్సవాలను ప్రారంభించిన జీఎం
విజిలెన్స్ అవగాహన వారోత్సవాలను ప్రారంభించిన జీఎం
ఇల్లందు, శోధన న్యూస్ : సింగరేణి వ్యాప్తంగా విజిలెన్స్ అవగాహనా వారోత్సవాలను అక్టోబర్ 30 నుండి నవంబర్ 05 వరకు నిర్వహించే కార్యక్రమాలలో భాగంగా సోమవారం జీఎం కార్యాలయం లో ఏరియా జియం జాన్ ఆనంద్ ప్రారంభించారు. విజిలెన్స్ వారోత్సవాల సందర్భంగా అధికారులు ఉద్యోగులందరూ పౌరుల సమగ్రతా ప్రతిజ్ఞ చేసారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ అవినీతి రహిత నవభారత దేశనిర్మాణంలో భాగంగా సింగరేణిలో విజిలెన్స్ అవగాహనా వారోత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. సింగరేణి సంస్థ నూతన ఒరవడులను అనుసరిస్తూ నగదు రహిత విధానం, సిసి కెమెరాలు, కార్యాలయాలలో బయోమెట్రిక్ విధానాలను ప్రవేశ పెట్టిందని అన్నారు. అలాగే ఉద్యోగులకు విద్యార్ధులకు వ్యాసరచన పై పోటీలను నిర్వహిస్తున్నామని అన్నారు. అలాగే జెకె.ఓసి, కె.ఓసి గనులు అన్ని విభాగాలు, ఏరియా హాస్పిటల్ నందు, సింగరేణి స్కూల్ లలో విభాగ అధిపతులచే విజిలెన్స్ వారోత్సవాలను ప్రారంభిస్తూ అధికారులు ఉద్యోగులందరూ పౌరుల సమగ్రతా ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో ఎస్ ఓటు జీఎం మల్లారపు మల్లయ్య, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ పంజాల శ్రీనివాసు, ఎజీఎం (ఐఇ) గిరిధరరావు, డిజియం పర్సనల్ జీవి మోహన్ రావు, ఉద్యొగులు పాల్గొన్నారు.