వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరపాలి
వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరపాలి
భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
– మంత్రి కొండ సురేఖ
భీమదేవరపల్లి, శోధన న్యూస్: ఉత్తర తెలంగాణ లో ప్రసిద్ధి చెందిన కొత్తకొండ వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు జనవరి 10 బుధవారం రోజున సాయంత్రం వీరభద్ర స్వామి వారి కళ్యాణం తో ప్రారంభం కానున్నాయి. తెలంగాణ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, దేవాదయ శాఖ మంత్రి కొండ సురేఖ మురళి దంపతులను వారి స్వగృహం లో ఈఓ కిషన్ రావు, ఆలయ అర్చకులు సన్మానించి తీర్థ ప్రసాదాలు, శుభ పత్రిక అందజేసి కళ్యాణ మహోత్సవానికి రావలసిందిగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ.. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, బ్రహ్మోత్సవాలు ఘనంగా జరపాలని ఆలయ ఈవో కిషన్ రావుకు సూచించారు. వీరితోపాటు హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ , కాజీపేట ఏసిపి డేవిడ్ రాజు,జడ్పిటిసి మారేపల్లి సుధీర్ కుమార్ లను స్వామివారి కళ్యాణ మహోత్సవమునకు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కార్యనిర్వహణాధికారి పి కిషన్ రావు అర్చకులు శ్రీకాంత్, వీరభద్రయ్య, శివకుమార్ , శరత్ చంద్ర, సిబ్బంది సంజీవరావు పాల్గొన్నారు.