వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు
వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు
పెనుబల్లి, శోధన న్యూస్: మండల వ్యాప్తంగా ముక్కోటి ఏకాదశి వేడుకలను శనివారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ముక్కోటి ఏకాదశి వేడుకలకు పెనుబల్లి సీతారామచంద్రస్వామి దేవస్థానంలోని రామాలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. ఈ మేరకు శుక్రవారం తెల్లవారుజాము నుండి ఆలయంలో ప్రత్యేక పూజలు, భజనలతో, మంత్రోచ్ఛరణలు, గానాలహరి సందడిని నిర్వహించారు. రామాలయ అర్చకులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు ఉత్తర ద్వార దర్శనాలను కల్పించారు. వాహనంపై స్వామివారి ఉత్సవ విగ్రహాలను గ్రామ పురవీధుల్లో గీతాలతో, తాళమేళాలతో, డప్పువాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా ఘనంగా ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రామాలయ ఉత్సవ కమిటీ ఆలయంలో రాములోరికి ప్రత్యేక అలంకరణలు చేసి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.