వైరా లో మాల ధరించిన అయ్యప్ప స్వాములకు నిత్యాన్నదానం
వైరా లో మాల ధరించిన అయ్యప్ప స్వాములకు నిత్యాన్నదానం
వైరా, శోధన న్యూస్ : నియోజకవర్గ కేంద్రమైన వైరాలో హరిహర అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో నిత్య అన్నదాన కార్యక్రమం జరిగింది. నేటి నుండి వచ్చే నెల 27 వరకు నిత్య అన్నదానం జరుగుతుందని అయ్యప్ప సేవా సమితి సభ్యులు తెలిపారు. మాల ధరించిన అయ్యప్ప స్వాములు అందరూ భక్తిశ్రద్ధలతో అన్నదాన కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. గత కొన్ని సంవత్సరాలుగా మాల ధరించిన భక్తులకు హరిహర సుత సేవాసమితి , కోదండ రామాలయం వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఎంతో శుభ పరిణామ మని గురుస్వాములు బాసటి రామారావు, కోమటిరెడ్డి భీమా అర్జునరెడ్డి, కొత్తపల్లి వెంకటేశ్వర్లు, బొగ్గుల లింగారెడ్డి గురు స్వాములు మాల ధరించిన భక్తులను భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ కోదండ రామాలయంలో వాతావరణంలో ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు.