శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు
శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు
-కరీంనగర్ పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు
కరీంనగర్, శోధన న్యూస్: శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్ట ప్రకారం కఠినంగా వ్యవహరిస్తామని కరీంనగర్ పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు తెలిపారు . ఈ సందర్బంగా మాట్లాడుతూ .. కరీంనగర్ రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధి నందు స్పెన్సర్ వద్ద రెండు వేరు వేరు మోటార్ సైకిల్ లపై వెళ్లే ఇద్దరు వ్యక్తులకు ఆక్సిడెంట్ జరిగిందన్నారు. వారి ఇరువురికి, ఒకరినొకరికి ఎటువంటి పరిచయం గాని, పాత కక్ష్యలు గాని లేవని, అనుకోని తప్పిదం వల్ల జరిగిన ఆక్సిడెంట్ మాత్రమే అన్నారు. అక్కడే వున్నకొంతమంది చట్టాన్ని అతిక్రమించి గుమిగా ఏర్పడి ఆక్సిడెంట్ కు కారణమైన వ్యక్తిపై ఇష్టారీతిన దాడి చేయడమే కాకుండా, అతని మోటార్ సైకిల్ ని తగలబెట్టేందుకు ప్రయత్నిచారు. సంఘటన జరిగినదని తెలిసిన వెంటనే స్థానిక పోలీసులు, బ్లూకోల్ట్ సిబ్బంది చేరుకొని నిలువరించే ప్రయత్నం చేసినప్పటికీ వారి మాట వినకుండా దుర్భాషలాడుతూ, విధులకు ఆటంకం కలిగించారు. ఈ సంఘటనకు సంబంధించి కరీంనగర్ రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ నందు బాధ్యులపై మూడు కేసులు నమోదు చేశామని, విచారణ ఇంకా కొనసాగుతుందన్నారు.
కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని, చట్ట ప్రకారం వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.