శాంతి భద్రతలు పరిరక్షణకు సహకరించాలి
శాంతి భద్రతలు పరిరక్షణకు సహకరించాలి
కామేపల్లి, శోధన న్యూస్ : మండల పరిధిలోని పండితాపురం గ్రామంలో శాంతిభద్రతలను పరిరక్షించే విధంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని ఖమ్మం రూరల్ ఏసిపి బసవ రెడ్డి,ఖమ్మం ఆర్డీవో గణేష్ లు అన్నారు. మండల పరిధిలోని తాళ్లగూడెం గ్రామంలో మండల పోలీస్ స్టేషన్ నందు పండితాపురం గ్రామానికి చెందిన ఇరు వర్గాల రాజకీయ నాయకులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల అనంతరం శాంతియుత వాతావరణంలో ప్రతి ఒక్కరు జీవించాలని అన్నారు. వ్యక్తిగత ఘర్షణలకు పాల్పడి కేసులు పాలు కావద్దని అన్నారు.ప్రతి ఒక్కరూ తమకు సహకరించి శాంతిభద్రతలను కాపాడే విధంగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సింగరేణి సిఐ తిరుపతి రెడ్డి,తహసిల్దార్ సుధాకర్ కామేపల్లి ఎస్ఐ ప్రవీణ్ కుమార్ పోలీస్ సిబ్బంది పండితాపురం గ్రామానికి చెందిన రాజకీయ నాయకులు తదితరులు పాల్గొన్నారు.