శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతీ ఒక్కరు సహకరించాలి -ఏసిపి బసవ రెడ్డి
శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతీ ఒక్కరు సహకరించాలి
-ఏసిపి బసవ రెడ్డి
కామేపల్లి,అక్టోబర్ 30 (ప్రభ న్యూస్ ): శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతీ ఒక్కరు సహకరించాలని ఖమ్మం రూరల్ ఏసిపి బసవ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని పండితాపురం గ్రామంలో సోమవారం ఖమ్మం రూరల్ ఏసిపి బసవ రెడ్డి,సింగరేణి సీఐ తిరుపతి రెడ్డి,కామేపల్లి ఎస్సై ప్రవీణ్ కుమార్ లు కేంద్ర పోలీస్ బలగాలతో పోలీస్ కవాత్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల నిబంధనలు అమలులో ఉన్నందున ప్రతి ఒక్కరూ శాంతియుత వాతావరణంలో మెలగాలని కోరారు. చిన్న ఘర్షలకు పాల్పడిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరు ఎన్నిక నియమాలను పాటించి తమకు సహకరించాలని కోరారు. శాంతి భద్రతలను పరిరక్షణకు విఘాతం కలిగించినా, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పోలీస్ బలగాలు తదితరులు పాల్గొన్నారు.