శాలివాహన మండల అధ్యక్ష, కార్యదర్శులు గా శ్రీనివాస్, కార్తీక్
శాలివాహన మండల అధ్యక్ష, కార్యదర్శులు గా శ్రీనివాస్, కార్తీక్
మణుగూరు, శోధన న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండల శాలివాహన(కుమ్మరి సంఘం) నూతన కమిటిని గురువారం ఎన్నుకున్నారు. కమిటీ గౌరవ అధ్యక్షునిగా నిమ్మనగోటి బిక్షపతి, అధ్యక్షునిగా శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా నాపంల్లి కార్తీక్, కుమ్మరి సంఘం మండల యూత్ అధ్యక్షుడిగా సంగెం గణేష్, ప్రధాన కార్యదర్శిగా చిలువేరు వెంకటేష్, కోశాధికారి నిమ్మనగోటి పుల్లారావులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం నూతన అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ.. మాపై నమ్మకం ఉంచి పదవీ బాధ్యతలు అప్పగించిన సంఘం సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కుమ్మరి సంఘం భవన కోసం, సంఘ అభివృద్ధి కోసం, కుమ్మర్ల హక్కుల సాధన కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో శాలివాహన సంఘం నాయకులు బొడ్డుపల్లి చంద్రమౌళి, కె తిరుపతి, జి భద్రయ్య, నాంపల్లి సందీప్, నిమ్మనగోటి పుల్లారావు, చెరుకుపల్లి ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.