తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

శాసనసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన జిల్లా ఎన్నికల అధికారి

శాసనసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన జిల్లా ఎన్నికల అధికారి

భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్: శాసనసభ ఎన్నికల నోటిఫికేషన్ ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్,  జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ప్రియాంక అల విడుదల చేశారు. శుక్రవారం ఐడిఓసి కార్యాలయపు సమావేశపు హాలులో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలపై ఎస్పీ డాక్టర్ వినీత్ తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 3వ తేదీ నుండి 10వ తేదీ వరకు నామినేషన్లు వేసేందుకు ఐదు నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. నామినేషన్లు దాఖలు చేయుటకు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు సమయం కేటాయించినట్లు తెలిపారు. 5వ తేదీ ప్రభుత్వ సెలవు కావడంతో నామినేషన్లు వేసేందుకు అవకాశం లేదన్నారు. కొత్తగూడెం నియోజకవర్గానికి కొత్తగూడెం ఆర్టీఓ కార్యాలయం, అశ్వారావుపేటకు అశ్వారావుపేట తహసిల్దార్ కార్యాలయంలో, ఇల్లందుకు ఇల్లందు తహసిల్దార్ కార్యాలయంలో, పినపాకకు మణుగూరు తహసిల్దార్ కార్యాలయంలో, భద్రాచలంనకు భద్రాచలం ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తారని తెలిపారు. ప్రతి రిటర్నింగ్ అధికారి కార్యాలయాలలో నామినేషన్లుకు సంబంధించి అన్ని ఫారాలు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. నామినేషన్లు ప్రక్రియపై అవగాహన కల్పనకు ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ లు  ఏర్పాట్లు చేసినట్లు  తెలిపారు. రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి 100 మీటర్లు దూరం వరకు ఎవరకి అనుమతి లేదన్నారు. నామినేషన్ వేసేందుకు ఐదుగురికి అలాగే మూడు వాహనాలకు మాత్రమే అనుమతిస్తారని తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేయు అభ్యర్థులకు ఎన్నికల సంఘం 40 లక్షల రూపాయలు వరకు అవకాశం కల్పించినట్లు తెలిపారు.. ఈ నెల 10వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారని, 13వ తేదీ పరిశీలన ఉంటుందని, తుది జాబితా 15వ తేదీ వరకు ఉపసంహరణకు అవకాశం ఉందన్నారు. నవంబర్ 30వ తేదీన పోలింగ్, డిసెంబర్ 3వ తేదీన ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఉంటుందని తెలిపారు. నామినేషన్ ప్రక్రియకు వచ్చే వాహనాలు, ర్యాలీలు, ప్రచార మెటీరియల్ తదితర ఖర్చులను అభ్యర్ధి యొక్క ఖర్చులకు జమచేస్తామని తెలిపారు. జిల్లాకు ఇద్దరు ఎక్స్చెండిచర్ అధికారులు గితేష్ కుమార్, సతీష్ చంద్రలను ఎన్నికల సంఘం నియమించిందని, జిల్లాలోని 1095 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని తెలిపారు. జిల్లాలో మొత్తం ఓటర్లు 945094 మంది ఓటర్లున్నారని వారిలో 461315 మంది పురుషుల, 83741 మంది మహిళలు, 38 మంది ట్రాన్స్ జెండర్లు, 43 మంది యస్ఆర్ఐ ఓటర్లు, 731 మంది సర్వీసు ఓటర్లు, 14930 మంది దివ్యాంగులు, 18-19 సంవత్సరాల వయస్సు గల యువ ఓటర్లు 22096, 80 సంవత్సరాలు పైబడినవారు 13082 మంది ఉన్నారని తెలిపారు.. సెప్టెంబర్ 20వ తేదీ నుండి అక్టోబర్ 31వ తేదీ వరకు 26693 మంది నూతన ఓటర్లుగా నమోదు చేసుకున్నారని, వాటిలో ఇప్పటి వరకు 11473 దరఖాస్తులు ఆన్లైన్ చేశామని, మిగిలిన 15220 దరఖాస్తులు ఈ నెల 10వ తేదీలోగా ఆన్లైన్ పూర్తి చేస్తామని చెప్పారు. 288 తీవ్రవాద సమస్య ఉన్న పోలింగ్ కేంద్రాలు, 12 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలున్నాయని శాంతి బద్రతలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ నిర్వహణకు పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పోలింగ్ ప్రక్రియలో భాగస్వాములయ్యేందుకు 1095 మంది పిఓలను, 1095 మంది ఏపిఓలను, 1095 మంది ఓపిఓలను, రిజర్వులో 908 మంది మొత్తం 5288 జాబితా సిద్ధం చేసినట్లు తెలిపారు.. పిఓ, ఏపిఓలకు మొదటి విడత శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 16 నోడల్ అధికారులు, 2174 మంది పోలీస్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల విధులు నిర్వహించు అధికారులకు, సిబ్బంది ఓటుహక్కు. వినియోగించుకునేందుకు ఫారం 12 ద్వారా పోస్టల్ బ్యాలెట్ ఇస్తున్నట్లు తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ పొందిన సిబ్బంది ఆర్ ఓ కార్యాలయంతో పాటు డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, శిక్షణా తరగతులు నిర్వహించే కేంద్రాల్లో ఓటు వేసేందుకు అవకాశం ఉందని చెప్పారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో విద్యుత్, మంచినీరు, వీల్ చైర్లు, ర్యాంపులు వంటి మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతి నియోజకవర్గంలో మహిళలకు 5 పోలింగ్ కేంద్రాలు, దివ్యాంగులకు 1.5 ప్రత్యేక పోలింగ్ కేంద్రాలు, 5 కేంద్రాలు యువతకు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.. 80 సంవత్సరాలు పైబడిన వారికి, 40 శాతం వైకల్యం కలిగిన దివ్యాంగులకు ఇంటివద్ద నుండే ఫారం 12డి ద్వారా ఓటుహక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. సి విజిల్ యాప్ కు  96 పిర్యాదులు రాగా అన్నింటిని పరిష్కరించినట్లు తెలిపారు.. 1950 కాల్ సెంటర్కు 1174 పిర్యాదులు రాగా నిర్ణీత సమయంలోగా అన్నింటిని పరిష్కరించినట్లు తెలిపారు.. వచ్చిన పిర్యాదుల్లో ఎక్కువశాతం నూతన ఓటరు నమోదు, ఎపికా కార్డులకు సంబంధించిన పిర్యాదులున్నట్లు తెలిపారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి నిబంధనలు ఉల్లంఘన జరిగినట్లయితే సి విజిల్, 1950 కంట్రోల్ రూములకు ఫోన్ చేయాలని సూచించారు. 16 ప్లైయింగ్ స్కాడ్ టీములు, 15 చెక్ పోస్టులు, 21 వీడియో సర్వెలెన్సు టీములు, 5 వీడియో వ్యూయింగ్ టీములు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎస్పి డాక్టర్ వినీత్ మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన తదుపరి నుండి ఇప్పటి వరకు 2,54,61,291 నగదు, 32,417 లీటర్ల మద్యం, 2059 కేజీల డ్రగ్స్, 2635 గ్రాముల వెండి. ఫ్రీ బీస్ సీజెడ్ ఐటెమ్స్ 5534 మొత్తం 4,81,70,963 విలువగలవి సీజ్ చేసినట్లు చెప్పారు. సీజ్ చేసినవాటిలో 92 కేసులకు సంబంధించి 191.15 లక్షలు విడుదల చేశామని, ఇంకనూ 6 కేసులకు సంబంధించి 18 లక్షలు విడుదల చేయాల్సి ఉన్నట్లు తెలిపారు.. 2018 ఎన్నికల్లో పోలింగ్ తక్కువగా జరిగినట్లు గుర్తించిన 164 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ శాతం పెంచేందుకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రజలు స్వేచ్చగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో డిపిఆర్డీఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *