శుభలేఖలు పంచడానికి వెళ్తూ మృతి
శుభలేఖలు పంచడానికి వెళ్తూ మృతి
సత్తుపల్లి , శోధన న్యూస్ : బంధువుల ఇంట పెళ్లి శుభలేఖలను ఇచ్చేందుకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంఘటన సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామంలో చోటుచేసుకుంది తిరువూరు మండలం అక్క పాలెం గ్రామానికి చెందిన ఎస్కే రహమతుల్లా అలియాస్ రాంబాబు (50) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం ఎర్రగుంటకు చెందిన తన మేనల్లుడు చిననాగులు మీరాతో కలిసి సత్తుపల్లిలో బంధువుల ఇంట గృహప్రవేశానికి హాజరయ్యారు మధుర మండలం ఖమ్మంపాడు గ్రామంలో శుభలేఖలు పంచడానికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా సత్తుపల్లి మండలం కృష్ణారాం వై జంక్షన్ వద్దకు రాగానే వీరి ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీ కొట్టింది ఈ ప్రమాదంలో షేక్ రహమతుల్లా అక్కడికక్కడే మరణించగా నాగుల మీద తలకు తీవ్ర గాయాలు విరిగి 108 వాహనంలో మెరుగైన చికిత్స కోసం ఖమ్మం తరలించారు మృతునికి భార్య ఖాసింబీ , కుమారులు లాల్ సాహెబ్, మీరా హుస్సేన్ ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.