ఖమ్మంతెలంగాణ

శైవక్షేత్రాల్లో వెలిగిన ఆకాశ దీపాలు  

శైవక్షేత్రాల్లో వెలిగిన ఆకాశ దీపాలు  

ఏన్కూరు, శోధన న్యూస్ : ఎంతో విశిష్టత కలిగిన కార్తీక మాసం మంగళవారం నుండి ప్రారంభం కావడంతో మండ లంలోని ఆలయాలన్నీ సందడిగా మారాయి. ఆధ్యాత్మిక వరoగా కార్తీక మా సం పరమ శివుడికి అత్యంత ప్రీతికమయింది.దీంతో భక్తులు దేవ దేవుడికి పెద్ద ఎ త్తున భక్తులు పూజలు నిర్వహి స్తున్నారు.దీంతో మండలంలో దేవాలయాలు శివ నామ స్మరణతో మారు మ్రోగు తున్నాయి..కార్తీక మాసంలోనే ఒకవైపు భక్తి పరవ శం,మరోవైపు వన భోజనాల విందు,వినోదాలలో మునిగి తేలడం ఈ కార్తీకమాసం ప్రత్యేకత.ఈ కార్తీకమాసంలో దాదా పు ప్రతి ఇంట్లో నోములతో పాటు సామూహిక సత్యనారాయ ణ స్వామి వ్రతాలను జరుపు కుంటున్నారు.ఈనెల14.వ తేదీ నుండి ప్రారంభమైన కార్తీక మాసం డిసెంబర్14.వ తేదీ వరకు ఉంటుంది.మండల వాసులు తెల్లవారుజామునే మంగళ స్నానాలు ఆచరించి తమ ఇష్ట దైవాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.ముఖ్యంగా శైవ దేవాలయాలు భక్తులతో ప్రతి రో జు సందడిగా మారాయి.కార్తీక మాసం ప్రారంభ రోజు నుండి గోపూజ,ఆకాశ దీపం ప్రారంభం,కార్తీక స్నానాలు ప్రారంభించారు.ఈ మాసంలో పరమ శివుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించడంతో పాటు శివాల యాలలో ప్రత్యేక పూజలు, గోత్రనామా లు,అర్చనలు,అభి షేకాలు నిర్వహిసున్నారు.మహా శివరాత్రి తరువాత పర మేశ్వ రుడు ప్రత్యేక పూజలు అందుకునేది ఈ కార్తీక మాసంలోనే. కార్తీకమాసములోనే వ చ్చే పౌర్ణమికి అత్యంత ప్రాధా న్యత ఇస్తారు. క్షీర సారగా మద నములో ముందుగా వెలువడిన హలా హలాన్ని (విషాన్ని ) సేవించి తన గొంతులో దాచు కోవడంతో ఆ ప్రభావానికి ఆ స్వస్థకు గురి అయిన పరమేశ్వరుడు అగ్ని దేవుడు సహకారంతో కా ర్తీక మాసంలో పౌర్ణమి రోజున కోలుకున్నట్లు పురాణ గాథల్లో చెప్పబడింది.దీంతో కార్తీక మాసంలో అత్యంత పవి త్ర మైన రోజుగా కార్తీక పౌర్ణమి ని భావిస్తారు.ఈ సం వత్సరం కార్తీక పౌర్ణమి ఆదివారం కావడంతో.. పౌర్ణమి చంద్రుడు నిండు వెన్నెలలో కార్తీక దీపాల వెలుగులు మరింత శోభాయ మానoగా దీపాల వెలుగుల్లో పూర్తిగా దీపావళిని తలపించింది. పౌ ర్ణమి కావడంతో మహిళలు అంతా ఉప వాస దీక్షలలో ఉండి రాత్రికి కార్తీకదీపం వెలిగించారు.కొంత మంది మహిళలు తమ ఇళ్లల్లోనే కార్తీక దీపాలు వెలిగిస్తే,మరి కొంత మ oది నదీ,పుణ్య తీర్థాలు,దేవాలయాల ప్రాంగణాలు పుష్కరిణుల వద్ద నూటక్కా ఒత్తులతో మొదలుకొని లక్ష ఒత్తులతో దీపారాధనలు చేశారు.అంతే కాకుండా పరమ శివుడి కృపను పొందేందుకు ఈరోజు తమ శక్తి మేర కు దాన ధర్మాలు చేశారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *