శ్రీ రామలింగేశ్వర స్వామి కి వెండి కిరీటం విగ్రహ బహూకరణ
శ్రీ రామలింగేశ్వర స్వామి కి వెండి కిరీటం విగ్రహ బహూకరణ
వైరా, శోధన న్యూస్ : వైరా నియోజకవర్గంలోని పరిసర ప్రాంతమైన స్థానాల లక్ష్మీపురం గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో శివలింగానికి ఆలయ కమిటీ చైర్మన్ చింత నిప్పు రాంబాబు భారతీ దంపతులు 96 వేల రూపాయలతో నూతనంగా తయారు చేయించిన వెండి విగ్రహాన్ని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దేవస్థానం పూజారికి సోమవారం అందజేశారు.ఈ సందర్భంగా చైర్మన్ దంపతులను ఆలయ పూజారి సాల్వాతో సత్కరించారు.ఈ ఈ సందర్భంగా చైర్మన్ రాంబాబు మాట్లాడుతూశ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. దేవునికి తమకున్న శక్తి మేర ఇటువంటి వెండి కిరీటాన్ని బహుహరించటం తమ అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. దేవుని ఆశీస్సులు ప్రజలందరూ పైన ఉండాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.