సంక్షేమ పథకాలు ప్రజల చెంతకు చేర్చిన ఘనత సిఎం కెసిఆర్ దే
సంక్షేమ పథకాలు ప్రజల చెంతకు చేర్చిన ఘనత సిఎం కెసిఆర్ దే
- ప్రజలే నా బలం, బలగం
- ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
మణుగూరు, శోధన న్యూస్: తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ప్రజల చెంతకు చేర్చిన ఘనత సిఎం కెసిఆర్ కే దక్కుతుందని ప్రభుత్వ విప్, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, పినపాక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్ధి రేగా కాంతారావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మున్సిపాలిటి పరిధిలోని బాపనకుంట ఏరియాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వంలో గ్రామాల్లో సీసీరోడ్లు, ఇంటింటికి త్రాగునీరు, 24గంటల విద్యుత్, రైతుబంధు, రైతుబీమా, దళితబంధు, కళ్యాణ లక్ష్మీ వంటి పథకాలతో ప్రజలకు ఎంతో మేలు జరిగిందన్నారు. ఈ దఫా ఎన్నికల్లో అన్నివర్గాల ప్రజల సంక్షేమం, అభ్యున్నతి కోసం సిఎం కెసిఆర్ బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో ప్రకటించారన్నారు. రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం, పెన్షన్ పెంపు, రూ.400లకే గ్యాస్ సిలిండర్ వంటి పథకాలను పొందుపర్చినట్లు, ఈ పథకాలతో ప్రజలకు మరింత లబ్దిచేకూరనుందన్నారు. సీఎం కేసీఆర్ సహకారంతో పినపాక నియోజవర్గాన్ని అభివృద్ధి చేశానని తెలిపారు. అభివృద్ధిని చూసి 30వ తేదీన జరగబోయే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి తనను మరోమారు ఎమ్మెల్యేగా గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తాళ్లపల్లి యాదగిరిగౌడ్, ముద్దంగుల కృష్ణ, ఎన్ రమేష్, మహిళా నాయకులు, యువజన నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.