సంక్షేమ పాలన సీఎం కేసీఆర్ కే సాధ్యం
సంక్షేమ పాలన సీఎం కేసీఆర్ కే సాధ్యం
– ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
అశ్వాపురం, శోధన న్యూస్: అశ్వాపురం మండలం గొందిగూడెం గ్రామంలో ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మేల్యే రేగా కాంతారావు సమక్షంలో అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీని వీడి సుమారు 60 కుటుంబాలు బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈసందర్భంగా ఆయన వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ ..సీఎం కేసీఆర్ తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని అయినా అన్నారు .తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ పేదలకు అనేక సంక్షేమ పథకాలను అందిస్తూ అండగా ఉంటున్నారన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందినట్లు తెలిపారు. సీఎం కెసిఆర్ 24 గంటలు కరెంట్ ఇస్తుంటే వారంటీ లేని పార్టీలు గ్యారెంటీలు ఇస్తూ ప్రజలను మోసం చేసేదందుకు వస్తున్నాయని అలాంటి పార్టీలను నమ్మే పరిస్థితిలో లేరన్నారు, తాను ఎల్లప్పుడూ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే నా బలగం బలమని అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించి చరిత్ర సృష్టిస్తామని ఆయన అన్నారు, బిఆర్ఎస్ మ్యానిఫెస్టో పేదల సంక్షేమానికి ఎంతో గాను ఉపయోగపడుతున్నది అన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమం పథకాలు ప్రపంచ దేశాలను ఆకర్షిస్తున్నాయన్నారు .65 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఊహించని అభివృద్ధి చేస్తున్నారన్నారు.