సండ్రను భారీ మెజార్టీతో గెలిపించండి -రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారధి
సండ్రను భారీ మెజార్టీతో గెలిపించండి
-రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారధి
సత్తుపల్లి, శోధన న్యూస్ : కారు గుర్తుపై ఓటు వేసి బిఆర్ఎస్ అభ్యర్థి సాండ్ర వెంకట వీరయ్యను భారీ మెజారిటీతో గెలిపించాలని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ బండి పార్థసారధి రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. వేంసూరు మండలంలోని పల్లెవాడ, ఎర్రగుంట పాడు గ్రామాల్లో శనివారం జరిగిన ఆత్మీయ సమ్మేళన సమావేశంలో పార్థసారధి రెడ్డి మాట్లాడుతూ ఎర్రగుంటపాడు గ్రామంలో గత ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ వచ్చిందని ఈ నెల 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అదే వరవడి కొనసాగించి భారత రాష్ట్ర సమితి అభ్యర్థికి మెజారిటీ ఇవ్వాలని ఆయన కోరారు. సండ్ర వెంకట వీరయ్య గెలుపులో ఎర్రగుంటపాడు గ్రామం క్రియాశీలకం కావాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమం కోసం పాటుపడ్డారని, పేదరికమే గీటురాయిగా సంక్షేమ పథకాల రూపకల్పన జరిగిందని ఆయన అన్నారు. గ్రామాల్లో చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకువస్తే తన ఎంపీ నిధుల నుండి పరిష్కరిస్తానని పార్థసారధి రెడ్డి హామీ ఇచ్చారు. సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధిలో ఇకనుండి సండ్ర వెంకట వీరయ్య తో పాటు తాను కూడా భాగస్వామి అవుతానని స్పష్టం చేశారు. ఈనెల 30 తారీకు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేసి సండ్ర వెంకట వీరయ్యను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో భారత రాష్ట్ర సమితి మండల అధ్యక్షుడు పాల వెంకటరెడ్డి, ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.