తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

సజావుగా ఎన్నికల నిర్వహణ ప్రక్రియ జరిగేలా  సహకరించాలి – ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రతీక్ జైన్

సజావుగా ఎన్నికల నిర్వహణ ప్రక్రియ జరిగేలా  సహకరించాలి

-పినపాక ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రతీక్ జైన్

మణుగూరు, శోధన న్యూస్:  ఎన్నికల నిర్వహణ ప్రక్రియ సజావుగా జరిగే విదంగా అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని పినపాక నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, భద్రాచలం ఐటిడిఏ పిఓ ప్రతీక్ జైన్ కోరారు. గురువారం మణుగూరు తహశీల్దార్ కార్యాలయంలో రాజకీయపార్టీల నాయకులతో ఆయన ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. నామినేషన్లు, ఎన్నికల నియమావళి, చేపట్టకూడని కార్యక్రమాలు తదితర అంశాలను పార్టీల నాయకులకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ విద్వేషాలకు పాల్పడవద్దని, కార్యక్రమాలు చేపట్టకూడదని, ప్రతీ ఒక్కరు ఎన్నికల నియమావళిని పాటించాలని సూచించారు. నేటి నుండి ప్రారంభమయ్యే నామినేషన్ల నుండి ఎన్నికల వరకు సజావుగా జరిగే విధంగా రాజకీయ పార్టీల వారు ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలని కోరారు. కార్యక్రమాలకు సంబంధించి సి-విజిల్ యాప్, సువిద యాప్ లను  వినియోగించుకోవాలన్నారు. రాత్రి 10గంటల నుండి ఉదయం 6గంటల వరకు లౌడ్ స్పీకర్లు వినియోగించరాదని, రాజకీయ సమావేశాలు ఆలయాలు, మసీదు, చర్చీలు, ప్రార్ధనా స్థలాలు, పోలింగ్ కేంద్రాలకు వంద మీటర్ల పరిధిలో నిర్వహించకూడదని తెలిపారు. అలాగే నీటి నుండి నామినేషన్ స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుండడంతో రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వంద మీటర్ల దూరం వరకు ఎవ్వరిని అనుమతించేది లేదని, ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం గంటల వరకు నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందన్నారు. నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థితో పాటు నలుగురిని మాత్రమే అనుమతిస్తామన్నారు. నామినేషన్ల ప్రక్రియ సిసి కెమెరాల పర్యవేక్షణలో కొనసాగుతుందన్నారు. ఎన్నికల నియామవళిని ఎవరు ఉల్లంఘించిన తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం మణుగూరు డిఎస్సీ రాఘవేంద్రరావు మాట్లాడుతూ రాజకీయ పార్టీలు సమావేశాలు, సభలు, ర్యాలీల నిర్వహణ కోసం ముందస్తుగా అనుమతులు తీసుకోవాలన్నారు. 24గంటల్లోగా ధరఖాస్తులను పరిశీలించి అనుమతులు ఇస్తామని తెలిపారు. ఒకే ప్రాంతంలో ఒకే సమయంలో ఎక్కువ మంది సమావేశాల నిర్వహణకు పోటీవడితే ముందుగా దరఖాస్తు చేసుకున్న వారికి అవకాశం కల్పిస్తామన్నారు. ముఖ్యమైన అతిధుల పర్యటనల సమయంలో పార్టీల నాయకులు పోలీస్ అధికారుల సమన్వయంతో పని చేయాలని, ప్రజలకు, అతిథులకు ఇబ్బందులు లేకుండా కార్యక్రమాలు నిర్వహించుకోవాలని సూచించారు. సామాజిక మాధ్యమాల్లో విద్వేషాలను రెచ్చగొట్టే పోస్టులు పెట్టడం, ఇతరులను దూషించడం, బెదిరించడం వంటివి చేస్తే చర్యలు తీసుకుంటారున్నారు. అనంతరం ఎన్నికల రిటర్నింగ్ అధికారి స్ట్రాంగ్ రూమ్ను వరిశీలించి సిబ్బందికి వలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి వి రాఘవరెడ్డి,ఎలక్షన్ సెల్ నుండి నాగరాజు, రామ్ నాయక్, సిబ్బంది వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *