సత్తుపల్లిలో కాషాయం జండా ఎగరవేస్తాం
సత్తుపల్లిలో కాషాయం జండా ఎగరవేస్తాం
తల్లాడ, శోధన న్యూస్ : సత్తుపల్లిలో కాషాయం జండా ఎగరవేస్తాం అని బిజెపి ఖమ్మం పార్లమెంట్ ఇంచార్జ్, రాష్ట్ర నాయకులు దేవకి వాసుదేవరావు అన్నారు. భారతీయ జనతా పార్టీ, జనసేన ఆధ్వర్యంలో తల్లాడ మండలంలో సత్తుపల్లి నియోజకవర్గ భాజపా అభ్యర్థి నంబూరి రామలింగేశ్వర రావువిజయాన్ని కాంక్షిస్తూ కలకోడిమా ,బసవాపురం గ్రామాలలో ఇంటింటి కి కరపత్రాన్ని పంచి ప్రచారం నిర్వహించారు . ఈ ప్రచార కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పార్లమెంట్ ఇంచార్జ్ దేవకి వాసుదేవరావు పాల్గొని ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు. రైతులకు మద్దతు ధర రూ.3100 ఇస్తామని రైతులకు ఫసల్ బీమా యోజన ద్వారాబీమా కల్పిస్తామని, పేదలకుఉచితంగా 4 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని నవజాత శిశువులకు రెండు లక్షల రూపాయలు ఫిక్స్డ్ చేస్తామని నిరుద్యోగ యువతకు యుపిసిసి తరహాలోనే పారదర్శక పద్ధతిలోపరీక్షలు నిర్వహిస్తామని స్వయం సహాయ బృందాలకు నామమాత్రపు వడ్డీతో రుణాలు అధికంగా ఇస్తామని, డీజిల్ పెట్రోల్ పై వ్యాట్ తగ్గిస్తామని బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని ఎస్సి ఉప వర్గీకరణకు వేగవంతం చేస్తామని ఓటర్లను ఓట్లు అభ్యర్థిస్తూకుటుంబ పాలనను అంతమొందించాలని మన పరిపాలన మనం చేసుకోవాలంటే భాజపాకు ఓటు వేయాలని,రామ మందిరం నిర్మించిన పార్టీ అని రామమందిర దర్శన భాగ్యం ఉచితంగా కల్పిస్తామని అభ్యర్థిస్తూప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలోభాజాపా మండల అధ్యక్షులు ఆపతి వెంకట రామారావు సత్తుపల్లి యోజకవర్గ జనసేన యూత్ అధ్యక్షులు సంగీతం సాయిచంద్ జనసేన తల్లాడ మండల అధ్యక్షులు తెనాలి దినేష్ ,ఎమ్మార్పీఎస్ నాయకులు బాబురావు , నాయకులు నంబూరు శ్రీనివాసరావు, భాజపా నాయకులు ఖమ్మం త్రీ టౌన్ అధ్యక్షులు దోనవనం , టౌన్ జనరల్ సెక్రెటరీ అంకతి పాపారావు తల్లాడ మండల కార్యదర్శి రాయల రమేష్ యువ మోర్చా అధ్యక్షులు ఎల్లంకి సుధాకర్ కర్నాటి సతీష్ రెడ్డితదితరులు పాల్గొన్నారు.