సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రి డయాలసిస్ సెంటర్లో షార్ట్ సర్క్యూట్
సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రి డయాలసిస్ సెంటర్లో షార్ట్ సర్క్యూట్
దగ్ధమైన విద్యుత్ పరికరాలు
సత్తుపల్లి, శోధన న్యూస్ : సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ రూంలోని హై వోల్టేజ్ కారణంగా షార్ట్ సర్క్యూట్ జరిగింది షార్ట్ సర్క్యూట్ వల్ల డయాలసిస్ సెంటర్ మొత్తం పొగలుముకున్నాయి. ఈ ఘటన జరిగినప్పుడు డయాలసిస్ రూంలో పేషెంట్లు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది షార్ట్ సర్క్యూట్ కారణంగా ఎం సి బి యూనిట్ మొత్తం దగ్ధమైంది మినహా మిగిలిన పరికరాలకు ఎటువంటి నష్టం కలగలేదని దెబ్బతిన్న విద్యుత్ పరికరాలను మార్చి యధావిధిగా డయాలసిస్ కొనసాగిస్తామని ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ వెంకటేశ్వర్లు తెలిపారు.