సమర్థవంతమైన పాలన దక్షకుడు సీఎం కేసీఆర్
సమర్థవంతమైన పాలన దక్షకుడు సీఎం కేసీఆర్
– రాజ్యసభ సభ్యులు బండి పార్థసారధి రెడ్డి
చంద్రుగొండ, శోధన న్యూస్: దేశంలోనే సమర్థవంతమైన పాలన దక్షకుడు సీఎం కేసీఆర్ అని రాజ్యసభ సభ్యులు బండి పార్థసారధి రెడ్డి అన్నారు.. చంద్రుగొండ మండల కేంద్రంలో గురువారం ఎన్నికల సన్నాహక సభలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చంద్రుగొండ మండలాన్ని దత్తత తీసుకొని తన వంతుగా అభివృద్ధి చేస్తానని ఆయన తెలిపారు. రాబోయే ఎన్నికల్లో అమలు చేయలేనటువంటి పథకాలతో వచ్చే పార్టీలకు బుద్ధి చెప్పాలని, ఇప్పటికే బిఆర్ఎస్వి జయవంతంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టిఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. అశ్వరావుపేట ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరావు ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అన్నారు అశ్వరావుపేట నియోజకవర్గంలో వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన ఎమ్మెల్యేగా నిలిచిపోయారని అన్నారు అటువంటి వ్యక్తిని గెలిపించుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ నామా నాగేశ్వరరావు, అశ్వరావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు,బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ధారా బాబు, జడ్పిటిసి కొనకండ్ల వెంకటరెడ్డి, పైడి వెంకటేశ్వరరావు, దొడ్డకుల రాజేశ్వరరావు ధారా యుగంధర్, నల్లమోతు వెంకటనారాయణ, భూపతి రమేష్ ,సయ్యద్ రసూల్ తదితరులు పాల్గొన్నారు.