సమస్యలు పరిష్కరించాలనిపోస్టల్ ఉద్యోగుల సమ్మె
సమస్యలు పరిష్కరించాలనిపోస్టల్ ఉద్యోగుల సమ్మె
చండ్రు గొండ, శోధన న్యూస్ : పోస్టల్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చంద్రుగొండ సబ్ పోస్ట్ ఆఫీస్ ఎదుట సంఘం మంగళవారం ఆధ్వర్యంలో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు ఎం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పోస్టల్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ పెన్షన్ సౌకర్యం కల్పించాలని పని భారం తగ్గించాలని కుటుంబ సభ్యులకు వైద్య సౌకర్యం కల్పించాలని ఎనిమిది గంటల పని దినాలతో పాటు టార్గెట్ల భారం తగ్గించాలని డిమాండ్ చేశారు. పనికి తగ్గ వేతనం ఇవ్వాలని ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు ఈ కార్యక్రమంలో సంఘం బాధ్యులు వెంకటకృష్ణ, శ్రీనివాసరావు ,గణేష్ ఫయాజ్ హుస్సేన్, లక్ష్మీ భారతి, బాల గణేష్, తదితరులు పాల్గొన్నారు.