సమస్యాత్మక గ్రామాలలో పోలీస్ ఫ్లాగ్ మార్చ్..
సమస్యాత్మక గ్రామాలలో పోలీస్ ఫ్లాగ్ మార్చ్..
-శాంతి భద్రతల పరిరక్షణకు శక్తి వంచన లేకుండా చర్యలు
-కొణిజర్ల ఎస్సై శంకర్
కొణి జర్ల శోధన న్యూస్: ఈనెల 30న జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు గాను కొణిజర్ల మండలంలోని సమస్యాత్మక గ్రామాలలో మంగళవారం కొనిజర్ల ఎస్సై జె శంకర్రావు ఆధ్వర్యంలో పోలీసు బృందాలు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించి కవాత్ చేశారు.ఈ సందర్భంగా మండలంలోని మండల కేంద్రమైన కొనిజర్ల బసవపురం రామ నరసయ్య నగర్ గ్రామాలలో స్పెషల్ పోలీస్ బెటాలియన్ తో గ్రామ పురవీధుల్లో ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు పోలీసులుఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్సై శంకర్ మాట్లాడుతూ గ్రామాలలోని ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ జరిగే విధంగా శాంతి భద్రతల పరిరక్షణలో శక్తి వంచన లేకుండా చర్యలు తీసుకుంటామని ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇందులో భాగంగా ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునే విధంగా వారిలో మనోధైర్యాన్ని కల్పించే విధంగా పోలీసు శాఖ వారికి అండగా ఉంటుందని తెలియజేసేందుకు కీలక గ్రామాలలో ఈ విధంగా పోలీసులతో చేయటం జరిగిందని చెప్పారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాలు మేరకు కొనిజర్ల మండలంలోని అన్ని గ్రామాల్లో కూడా ప్రజలు ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా తమకు నచ్చిన వారికి మంచి ప్రజాప్రతినిధులకు ఎన్నుకునే విధంగా తమ ఓటును తామే సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. గ్రామాలలో ఎటువంటి అల్లర్లకు కానీ వివాదాలకు కానీ ఘర్షణలకు శాంతి భద్రతల పరిరక్షణకు ఎటువంటి ఈ ఘాతం కలిగించిన చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ తెలిపారు. ఇందులో భాగంగా ప్రధానంగా గతంలో జరిగిన ఎన్నికల్లో ఘర్షణలలో చోటుచేసుకున్నటువంటి గ్రామాలను గుర్తించి అటువంటి గ్రామాలలో కారణమైనటువంటి వ్యక్తులను కూడా గుర్తించి వారితో పోలీస్ శాఖ చర్చలు జరిపి. ముందస్తు చర్యల్లో భాగంగా వారికి అవగాహన కల్పించడం జరిగిందని ఆయన తెలిపారు.