సమాచారం ఇవ్వండి.. బహుమతి పొందండి..
సమాచారం ఇవ్వండి.. బహుమతి పొందండి…
-కరకగూడెం ఎస్సై రాజా రామ్
కరకగూడెం, శోధన న్యూస్: మావోయిస్ట్ ల ఆచూకి సమాచారం ఇచ్చి తగిన బహుమతి పొందండి అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల పోలీస్ శాఖ తెలిపింది. మావోయిస్టు తో కూడిన మండలంలోని వాల్ పోస్టర్లు పలు గ్రామాలలో అంటించారు. ఈ సందర్భంగా కరకగూడెం ఎస్సై రాజా రామ్ మాట్లాడుతూ.. ఫోటోలో ఉన్న మావోయిస్టు ఆచూకీ తెలిపిన వారికి తగిన బహుమతులు ఇవ్వబడును, వివరాలు అందించిన వారిని గోప్యంగా ఉంచుతామని వారు తెలిపారు. మండలంలో అపరి చితు వ్యక్తులు సంచరిస్తే వెంటనే ఏడుల బయ్యారం సి ఐ శివప్రసాద్ కు. కరకగూడెం ఎస్సై రాజా రామ్ కు తక్షణమే సమాచారాన్ని తెలియజేయాలని సూచించారు.. ఎవరైన మావోయిస్టులకు సహకరిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.