సింగరేణి అధ్వర్యంలో మహిళలకు దీపాలంకరణ పోటీలు
సింగరేణి అధ్వర్యంలో మహిళలకు దీపాలంకరణ పోటీలు
మణుగూరు, శోధన న్యూస్ : సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని సింగరేణి కాలరీస్ ఆధ్వర్యంలో పి.వి కాలనీ, కమ్యూనిటీ హాలు నందు సింగరేణి కుటుంబాల మహిళలకు, స్థానిక మహిళలకు, యువతులకు మంగళవారం రాత్రి దీపాలంకరణ పోటీలు నిర్వహించారు. ఈ దీపాలంకరణ పోటీలకు ముఖ్య అతిధిగా విచ్చేసిన ఎస్ఓ టు జిఎం వీసం కృష్ణయ్య పోటీలను ప్రారంభించారు. అనంతరం ఎస్ఓటు జిఎం వీసం కృష్ణయ్య మాట్లాడుతూ… మహిళా శక్తి ఎంతో గొప్పది. మహిళలు వంటింటికే పరిమితం అన్న నానుడిని తుడిచేసి, నేటి మహిళలు మగవారితో సమానంగా బస్సులు, రైళ్లు,విమానాలు నడపడమే గాక అంతరిక్షంలోను విజయపతాకం ఎగరవేయడం స్త్రీ జాతికి ఎంతో గర్వకారణం. మహిళలు ఒకవైపు తమ హక్కులకై పోరాడుతూనే మరోవైపు అన్నీ రంగాల్లో రాణించాలి. మహిళలను ఆయా రంగాల్లో ప్రోత్సహించడం సామాజిక భాద్యతలో ఓ భాగం కాబట్టి సింగరేణి యాజమాన్యం మహిళలు స్వావలంబన సాదించడానికి ఉచిత శిక్షణాలు ఇవ్వడంతోపాటు, మహిళల ప్రతిభా వెలికితీయడానికి మహిళా క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుంది అన్నారు. ఈ దీపాలంకరణ పోటీలలో విజేతలకు బహుమతి ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు లేడీస్ క్లబ్ సెక్రటరీ కవిత, లేడీస్ క్లబ్ సభ్యులు రామ, భాస్కరి, కవితా, సీనియర్ పర్సనల్ అధికారి సింగు శ్రీనివాస్, సేవ సెక్రెటరీ షకీరా, స్పోర్ట్స్ సూపర్వైసర్ జాన్ వెస్లీ తదితరులు పాల్గొన్నారు.