సింగరేణి ఎక్సైజ్ శాఖ పరిధిలో నూతన వైన్ షాపులు ప్రారంభం…..
నూతన వైన్ షాపులు ప్రారంభం…..
కారేపల్లి, శోధన న్యూస్: సింగరేణి ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయం పరిధిలో శుక్రవారం పది వైన్స్ షాపులను ప్రారంభిస్తున్నట్లు సీఐ జుల్ఫికర్ అహ్మద్ తెలిపారు.శుక్రవారం క్రాస్ రోడ్ లోని ఎక్సైజ్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లా సింగరేణి ఎక్సైజ్ శాఖ పరిధిలో కారేపల్లి కామేపల్లి,ఏన్కూరు మండలాలలో కలిపి మొత్తం10 వైన్ షాపులు ఉన్నాయని ఇవన్నీ నూతనంగా ప్రారంభమైనట్లు తెలిపారు.ఇటీవల ప్రభుత్వం నిర్ణయించిన వైన్ షాపుల కేటాయింపులలో షాపులు దక్కించుకున్న యజమానులు షాపులను తెరవను న్నారు.నూతనంగా షాపులు తెరిచే వారికి ఇండెంట్ ప్రకారం మద్యం సరఫరా చేస్తామని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్సై రమణ,సిబ్బంది ఉన్నారు.