సింగరేణి డే ఏర్పాట్లను లోటుపాట్లకు తావు లేకుండా చేయాలి-ఏరియా జీఎం దుర్గం రామచందర్
సింగరేణి డే ఏర్పాట్లను లోటుపాట్లకు తావు లేకుండా చేయాలి
-ఏరియా జీఎం దుర్గం రామచందర్
మణుగూరు, శోధన న్యూస్: సింగరేణి డే ఏర్పాట్లను ఎటువంటి లోటుపాట్లకు తావులేకుండా చేయాలని సింగరేణి కాలరీ స్ మణుగూరు ఏరియా జీఎం దుర్గం రామచందర్ అన్నారు. గురువారం పివి కాలనీ భద్రాద్రి స్టేడియంలో జరుగుతున్న సింగరె ణి దినోత్సవ వేడుకల ఏర్పాట్లను ఆయన సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఈ నెల 23 వ తేదీన జరుగనున్న సింగరేణి దినోత్సవ వేడుకలకు భారీ ఎత్తున సింగరేణియులు, వారి కుటుంబ సభ్యులు, స్థానిక పురజనులు హాజరు కావడం ఆనవాయితీగా కొనసాగుతుందన్నారు. వేడుకలకు వచ్చే వారికి ఎలాంటి అ కర్యం, ఇబ్బంది కలుగకుండా కుర్చీలు, మంచి నీటి సౌకర్యాలు, ప్రధాన వేదికను కళాత్మకంగా సుందరికరించడం, గ్రౌండ్ లెవలింగ్, స్టేడియం మొత్తం లైటింగ్, మహిళల రక్షన కొరకు సెక్యూరిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. వేడుకలు ఆసాంతం ప్రశాంతంగా, విజయవంతంగా జరిగేలా ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని సూచించారు. సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఇతర ప్రాంతాల నుండి వచ్చే కళాకారులు, స్థానిక సింగరేణి ఉద్యోగ కళాకారులు అందరినీ అలరించేలా చక్కని సాంసృ్కతిక ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సింగరేణి డే సందర్భంగా వివిధ రకాల స్టాల్స్ ఎట్టుకునే వ్యాపారస్తులు రుచి సుచికరమైన పదార్ధాలు అందించడంతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించేలా నిబంధనలు వి ధించాలని, వేడుకల నిర్వహణపై విస్తృత ప్రచారం నిర్వహించాలని అధికారులకు సూచించారు. వేడుకలకు సింగరేణియులు, వారి కుటుంబ సభ్యులు, పురజనులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్వోటు జీఎం వీసం కృష్ణయ్య, ఏజిఎం (సివిల్) వెంకటేశ్వర్లు, ఏరియా ఇంజినీర్ ఎం సర్సీ రెడ్డి, డిజిఎం(పర్సనల్) ఎస్ రమేశ్, ఎస్ఈ (ఈఅండ్రం) ఏరియా వర్క్ షాప్ ఎన్ మధుసూదన్, శోభన్ బాబు, సీనియర్ పర్సనల్ అధికారులు సింగు శ్రీనివాస్, వి రావె శ్వర రావు, ఈఈ (సివిల్) ప్రవీణ్ కుమార్, అస్సిస్టెంట్ స్పొర్ట్స్ సూపర్వైజర్ జాన్ వెస్లీ తదితరులు పాల్గొన్నారు.