సింగరేణి లో టి బి జి కే ఎస్ ను గెలిపించాలి
సింగరేణి లో టి బి జి కే ఎస్ ను గెలిపించాలి
ఇల్లందు, శోధన న్యూస్ : సింగరేణి లో ఎన్నికలు ఈ నెల 27 జరగబోతున్నాయనీ ఈ ఎన్నికల్లో టి బి జి కే ఎస్ ను గెలిపించాలని ఆ సంఘం నాయకులు రంగనాథ్ కోరారు. ఇప్పటివరకు ఇల్లందు కార్మికులను టి బి జి కే ఎస్ కడుపులో పెట్టుకొని కాచుకుందనీ ఇక్కడినుండి ఆపరేటర్లకు ట్రానస్ఫర్లు వచ్చినా ఒక్కరిని కూడా బైటికి పోకుండా ఆపిందన్నారు. అంతేకాక ఇల్లందు కు కొత్త ఉద్యోగులను జనరల్ మజ్దర్లు, ఫిట్టర్ లాంటి వారిని తెప్పించింది. కొత్త ఓ సి పూసపెల్లి కోసం పబ్లిక్ హియరింగ్ మొదలు, మొన్నటి సర్వే వరకు బాధ్యతగా ఇల్లందు మనుగడకోసం మన కార్మికులు ఇక్కడే ఉండాలని యాజమాన్యానికి సహకరించిందన్నారు అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఇల్లందు ను కాపాడమని కోరిందనీ బాధ్యత గల గుర్తింపు సంఘం గా ఇల్లందు లో పారిశ్రామిక శాంతిని కాపాడుతూ ఉత్పత్తి ,ఉత్పాదకత, భద్రత లో ముందుంచడానికి ఇల్లందు కార్మికుల సహకారంతో ఇల్లందు కు ఒక ప్రత్యేక గౌరవం తెప్పించిందన్నారు. అదే ఇవ్వాళ ఈ ఏరియా నిలబడటానికి ముఖ్యకారణం అయ్యిందనీ ఇది ప్రతీ కార్మికుని విజయంగా టి బి జి కే ఎస్ భావిస్తుందన్నారు.అధికారం లేకున్నా 2012 లోనే టి బి జి కే ఎస్ గుర్తింపు సంఘం గా గెలిచిందన్నారు.తెలంగాణ పోరాటంలో అక్షరాలు దిద్దిన టి బి జి కే ఎస్ కు పోరాటాలు కొత్తేమీ కాదనీ సింగరేణి లో అనేక హక్కులు సాధించి కార్మికుల మనసుల్లో చెరగని ముద్రవేసిన సంఘం టి బి జి కే ఎస్, 61 సం. కు పదవి విరమణ వయసు పెంచడం, డిపెండెంట్ ఉద్యోగాలు ఇప్పించడం, తెలంగాణ ఇంక్రిమెంట్, ఉచిత కరెంట్, ఉచిత ఏ సి తల్లిదండ్రులకు కార్పొరేట్ వైద్యం, ఆడపిల్లలకు ఉద్యోగం, అంబేడ్కర్ జయంతి సెలవు, రంజాన్, క్రిస్మస్ , సంక్రాంతి సెలవులు ఇవన్నీ చరిత్రలో నిలిచిపోయే హక్కులు. ఇంకా ఎన్నో ఆర్థిక , ఉద్యోగ హక్కులు సాధించిన యూనియన్ టి బి జి కే ఎస్ ఇవన్నీ ఒక్క సమ్మె, ఒక్క ధర్నా లేకుండానే సాధించి చూపించిన సంఘం టి బి జి కే ఎస్ అని అన్నారు. ఈ ఎన్నికలలో బాణం గుర్తుతో టి బి జి కే ఎస్ మీ ముందుకు వచ్చిందనీ కార్మికులు ఆలోచించి తమ విజ్ఞతను ప్రదర్శించి కార్మికుల హక్కులకోసం పోరాడే యూనియన్ గా టి బి జి కే ఎస్ ను గెలిపించాలని కోరారు.