సిఎం కేసీఆర్ తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం
సిఎం కేసీఆర్ తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం
– బి ఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జ్ ఉప్పల వెంకటరమణ
అశ్వా రావుపేట, శోధన న్యూస్ : తెలంగాణ అభివృద్ధి ఒక కేసీఆర్ వల్లే సాధ్యమవుతుందని బి ఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జ్ ఉప్పల వెంకటరమణ అ న్నారు. శనివారం నియోజకవర్గ కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సిఎం కేసీఆర్ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశారని అన్నారు. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో అమలు కానటువంటి ప్రజా సంక్షేమ పథకాలు ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే అమలవుతున్నాయని అన్నారు. దేశం యావత్తు చూపు ప్రస్తుతం తెలంగాణ వైపే ఉందని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ,దళిత బంధు, రైతు బంధు, రైతు బీమా,ఉచిత విద్యుత్ వంటి ప్రజా సంక్షేమ, పథకాలను రాష్ట్రంలో అమలు చేస్తున్నారని అన్నారు. అలాగే బి ఆర్ఎస్ ప్రభుత్వం లోనే అశ్వా రావుపేట నియోజకవర్గం సమగ్ర అభివృద్ధి చెందిందని తెలిపారు. ఈ నెల 30 న జరగనున్న ఎన్నికలలో బి ఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మచ్చా నాగేశ్వరావును అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్ మూర్తి, బి ఆర్ఎస్ జిల్లా అధికార ప్రతినిధి ఉపాధ్యాయుల సూర్య ప్రకాష్ రావు, సీనియర్ నాయకులు మందపాటి రాజమోహన్ రెడ్డి, తాడేపల్లి రవి, గొడవర్తి వెంకటేశ్వరరావు, వెంకన్న బాబు, జిల్లా రైతుబంధు సమితి కన్వీనర్, దమ్మపేట సొసైటీ చైర్మన్ రావు జోగేశ్వరరావు, సత్యవరపు సంపూర్ణ, వైస్ ఎంపీపీ ఫణీంద్ర, పర్వతనేని రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.