ఖమ్మంతెలంగాణ

సిపిఆర్ పై ప్రజల్లో చైతన్యం  

సిపిఆర్ పై ప్రజల్లో చైతన్యం  

సత్తుపల్లి, శోధన న్యూస్ : గాంధీనగర్ ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఉపాద్యాయుడు కంభంపాటి వెంకటేష్ ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. ఈ మధ్యకాలంలో గుండెపోటు సమస్య ప్రజల్లో కలకలం రేపుతోంది.ప్రతి రోజు ఏదో ఒకచోట వయసుతో సంబంధం లేకుండా గుండెపోటుతో చనిపోతున్న సంఘటనలు అనేకం చూస్తున్న ఉపాధ్యాయుడు వెంకటేష్ సి పి ఆర్ ఫై ప్రజల్లో చైతన్య కల్పించాలని ముందుకు సాగుతున్నాడు. ప్రముఖ వ్యక్తులు క్రీడాకారులు,నటులు విద్యార్థులు ప్రతి ఒక్కరూ ఈ కార్డియాక్ అరెస్ట్ భారిన పడి ఆకస్మాత్తుగా మరణిస్తున్న నేపథ్యంలో గుండెపోటుకు ప్రధమ చికిత్సగా ఆపర సంజీవనిలా పనిచేసే సిపిఆర్  గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయుడు వెంకటేష్ తన వంతు ప్రయత్నాలు చేస్తున్నాడు .గతంలో సోషల్ మీడియా వేదికగా ప్రచారం నిర్వహించాడు. తాజాగా టీ షర్ట్ పై సిపిఆర్  గురించి ముద్రించి కరపత్రాలతో అవాగహన కల్పిస్తున్నాడు. దీనికి సంబంధించిన ప్రచార టీ షర్ట్ ను మంగళవారం స్థానిక శాసన సభ్యులు మట్టా రాగమయి సత్తుపల్లి లో ఆవిష్కరించారు.ఈ కార్యక్రమం నిర్వహణ చాలా అవసరమైందని ఇలాంటి అవగాహన కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని ఉపాధ్యాయుడు వెంకటేష్ ను ఎమ్మెల్యే మట్ట రాగమయి అభినందించి వెంకటేష్ కు కార్యక్రమ నిర్వాహణకు తనవంతు ప్రోత్సహం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చక్రపాణి,ఉపాధ్యాయులు నరసింహారావు,కంకటి వెంకటేశ్వరావు,కుమారి,భాగ్యాలక్షి విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *