సిపిఎం పార్టీ అభ్యర్థి భాస్కర్ ని గెలిపించాలి
సిపిఎం పార్టీ అభ్యర్థి భాస్కర్ ని గెలిపించాలి
ఎరుపాలెం, శోధన న్యూస్ : ఈనెల 30వ తారీఖున జరగనున్న శాసనసభ ఎన్నికలలో మధిర నియోజవర్గ సిపిఎం పార్టీ అభ్యర్థి పాలడుగు భాస్కర్.. విజయాన్ని కాంక్షిస్తూ తల్లి వెంకటమ్మ .. ఆయన సతీమణి సునీత పార్టీ నాయకులతో కలిసి మంగళవారం ముమ్మర ప్రచారాన్ని నిర్వహించారు. మండల కేంద్రమైన ఎర్రుపాలెంతో , మీనవోలు గ్రామాలలో విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే భాస్కర్ ని గెలిపించాలని గడపడ గడప కు ప్రచారాన్ని నిర్వహిస్తూ ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు. సుత్తి కొడవలి నక్షత్రం గుర్తు పైన తమ అమూల్యమైన ఓట్లను వేసి ఆత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి వీరయ్య , సిఐటి యు నాయకులు రాములు, మండల కమిటీ నాయకులు రామిశెట్టి సురేష్, షేక్ నాగుల మీ రా కుర్ర వెంకటరామయ్య, అంకాలరావు, హుస్సేన్ రావు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.