సీఎం కెసిఆర్ ప్రజా ఆశీర్వాద సభను జయప్రదం చేయాలి – ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
సీఎం కెసిఆర్ ప్రజా ఆశీర్వాద సభను జయప్రదం చేయాలి
- ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
మణుగూరు, శోధన న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం లోని బూర్గంపాడు మండలంలో ఈనెల 13వ తేదీన ఎన్నికల ప్రచారంలో భాగంగా జరగనున్న బిఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభను జయప్రదం చేయాలని ప్రభుత్వ విప్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు శనివారం తెలిపారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆశీస్సులతో పినపాక నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మూడోసారి మీ ముందుకు వస్తున్నానని, ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదించాలని ఆయన కోరారు. ప్రజా ఆశీర్వాద సభకు పార్టీ శ్రేణులు , కార్యకర్తలు, అభిమానులు, ప్రజా ప్రతినిధులు, అనుబంధ సంఘాల నాయకులు, వేలాది మంది ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.