సీఎం కేసీఆర్ సభకు భారీగా జన సమీకరణ చేయాలి -ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
సీఎం కేసీఆర్ సభకు భారీగా జన సమీకరణ చేయాలి
-ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
బూర్గంపాడు, శోధన న్యూస్ : ఈనెల 13వ తేదీన బూర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామంలో జరగనున్న సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు భారీగా జన సమీకరణ చేయాలని, సభను విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పిలుపునిచ్చారు. శనివారం sభద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామంలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, పినపాక నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ఇంచార్జ్ కోనేరు సత్యనారాయణ (చిన్ని)ల ఎన్నికల ప్రచారంలో భాగంగా వందమంది బూత్ కమిటీ సభ్యులు కోఆర్డినేటర్లతో, పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకులతో, ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ 13వ తేదీన బూర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామంలో ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ము ఖ్యఅతిథిగా హాజరవుతున్నారని, పినపాక నియోజకవర్గం లోని అన్ని మండలాల నుంచి అధిక సంఖ్యల అభిమానులు వచ్చేందుకు సన్నద్ధమవుతున్నారని, బూత్ కమిటీ సభ్యులు, కోఆర్డినేటర్లు ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సమన్వయం చేయాలన్నారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో పినపాక నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మూడోసారి ప్రజల ముందుకు వస్తున్నానని ఆయన అన్నారు. ఈ సమావేశానికి నియోజకవర్గంలోని ఏడు మండలాల నుంచి సుమారు 60 వేల మంది జనాభా హాజరవుతున్నట్లు ఆయన తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా అమలు చేయని సంక్షేమ పథకాలు ఒక తెలంగాణలోనే అమలవుతున్నాయని అన్నారు. పథకాలను ఇంటింటికి తీసుకువెళ్లి వివరించాలన్నారు. ఈనెల 30 తేదీన జరిగే ఎన్నికలలో కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిదులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.