తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

సీఎం కేసీఆర్ సారధ్యంలో సింగరేణి కార్మికుల జీవితాల్లో వెలుగులు ప్రభుత్వ విప్ రేగా

సీఎం కేసీఆర్ సారధ్యంలో సింగరేణి కార్మికుల జీవితాల్లో వెలుగులు

  • ప్రభుత్వ విప్ రేగా, టిబిజికెఎస్ రాష్ట్ర అధ్యక్షులు వెంకట్రావు

 

మణుగూరు, శోధన న్యూస్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ సారధ్యంలో సింగరేణి కార్మికుల జీవితాల్లో వెలుగులు నిండాయని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే,బీఆర్రేఎస్ అసెంబ్లీ అభ్యర్థి రేగా కాంతారావు అన్నారు. మణుగూరు ఏరియా లోని పీకే ఓసి 2 లో సింగరేణి కార్మికులతో ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్ కు ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు, టిబిజికెఎస్ రాష్ట్ర అధ్యక్షులు బి వెంకట్రావు లు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు.సింగరేణి కార్మికుల సంక్షేమానికి బీఆర్ ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. రాష్ట్రం సాధించుకున్న తర్వాత సింగరేణి సంస్థలు సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధికి కార్మిక లోకమంతా ఆయనకు అండగా నిలుస్తుందన్నారు. సింగరేణి సంస్థ అంటే సీఎం కేసీఆర్…. సీఎం కెసిఆర్ అంటే సింగరేణి సంస్థ అని సింగరేణి కార్మికులు చెప్పుకుంటున్నారని వారు అన్నారు. ఈ నెల 30వ తేదీన జరిగే అసెంబ్లీ ఎన్నికలలో కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని విప్ రేగా కాంతారావు కోరారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ సమావేశంలో టిబిజికెఎస్ బ్రాంచ్ ఉపాధ్యక్షులు వి ప్రభాకర్ రావు, బిఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు, కార్మికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *