సీఎం రేవంత్ రెడ్డి,ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లులకు ఇఫ్టూ అభినందనలు
సీఎం రేవంత్ రెడ్డి,ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లులకు ఇఫ్టూ అభినందనలు
మణుగూరు, శోధన న్యూస్ : తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లులకు ఇఫ్టూ ఏరియా అధ్యక్షులు ఏ మంగీలాల్ యూనియన్ తరపున ప్రత్యేక శుభాభినందనలు తెలిపారు. శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ. గత బిఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల విషయంలో నిరంకుశంగా వ్యవహరించిందన్నారు. కాంగ్రెస్ హయాంలోనైనా కార్మికుల సమస్యలు సత్వర పరిష్కారానికి తగిన ప్రాధాన్యత నిచ్చి పరిష్కరించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ తన అభయహస్తం మేనిఫెస్టో లో ప్రకటించిన కార్మికుల సమస్యలతో వివిధ కార్మిక సంఘాలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే సమస్యలను కూడా సత్వరం, పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. సింగరేణి సంస్థ లో ఉత్పత్తి ఉత్పాతకలో చాలీచాలని వేతనలతో జీవితాన్ని గడుపుతున్న 30 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఎనిమిది ఏళ్లుగా వారి సమస్యల పరిష్కారానికి నోచుకోవడం లేదన్నారు. ఎన్ని ఉద్యమాలు చేసిన, వినతులు సమర్పించిన బి ఆర్ ఎస్ ప్రభుత్వంలో చలనం లేకపోయిందని అన్నారు. రాష్ట్రంలో ప్రధానంగా 73 షెడ్యూల్ ఎంప్లాయిమెంట్స్ జీవోలను సవరించడం ,జీవోలకు గెజిట్ జారీ చేయడం, కనీస వేతనం రూ26 వేలు అమలు, కార్మికుల పట్ల న్యాయస్థానాల తీర్పును అమలు, సమాన పనికి సమాన వేతనం అమలు, ధరల నియంత్రణ, ఉద్యోగ భద్రత, కార్మిక కుటుంబాలకు మెరుగైన వైద్య సదుపాయం అమలు సింగరేణి లాభాల్లో పర్మినెంట్ ఉద్యోగులకు వాటాగా బోనస్ చెల్లిస్తున్నట్లుగానే, కాంట్రాక్ట్ కార్మికులకు కూడా చెల్లించడం సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై సకాలంలో ఒక నిర్దిష్ట నిర్ణయాన్ని తీసుకొని కార్మికుల సమస్యలు పరిష్కార దిశగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో సింగరేణి కాంటాక్ట్ కార్మికులు కే రవికుమార్, కే గురుమూర్తి, వి శంకర్ నాయక్, జి నాగేశ్వరరావు, కే నాగేశ్వరరావు, టి రామకృష్ణ, ఎం టైసన్, ఐ గోపి, జి సాయికుమార్, యు శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.