ఖమ్మంతెలంగాణ

సీతారామ ప్రాజెక్ట్ పనులను పూర్తి చేయడమే నా లక్ష్యం – మంత్రి తుమ్మల నాగేశ్వరావు

సీతారామ ప్రాజెక్ట్ పనులను పూర్తి చేయడమే నా లక్ష్యం

– మంత్రి తుమ్మల నాగేశ్వరావు

సత్తుపల్లి, శోధన న్యూస్: సత్తుపల్లి మండలం యాతాలకుంట గ్రామం లో సీతారామ ప్రాజెక్ట్ పనులపై ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ,జారే ఆదినారాయణ మరియు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, డాక్టర్ మట్టా దయానంద్ .
మంత్రి తుమ్మల నాగేశ్వరావు అధికారులతో మాట్లాడుతూ గోదావరి జలాలు 10 లక్షల ఎకరాలు ఇచ్చేందుకు తలపెట్టినది సీతారామ ప్రాజెక్ట్ ఇప్పటికే 7 వేలకోట్ల కు పైగా ఖర్చు జరిగింది టన్నెల్ రెండు వైపుల నుండి పనులు చేసి పూర్తి చేయాలి టెక్నాలజీని ఉపయోగించి పనులు పూర్తి చేస్తున్నారు యాతలకుంట టన్నెల్ పూర్తి అయితే బెత్తుపల్లి,లంకా సాగర్ కు నీళ్లు అందుతాయి గండుగులపల్లి లో నాలుగో పంప్ హౌస్ పనులు జరుగుతున్నాయి యాతాల కుంట టన్నెల్ ప్రధానమైంది అన్నారు నిత్య పర్యవేక్షణ తో అధికారులు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి అని సూచించారు సత్తుపల్లి నియోజక వర్గానికి సీతారామ ప్రాజెక్ట్ లో ప్రధానమైంది యతాల కుంట టన్నెల్ యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయాలి అని సూచించారు. నాకు ఉన్న రాజకీయ కోరిక సీతారామ ప్రాజెక్ట్ పూర్తి చేయటం. ప్రాజెక్ట్ పనులకు ఆటంకం కలగకుండా చూస్తాను సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.సీతారామ ప్రాజెక్ట్ జిల్లా ప్రజల ఆశా ఆకాంక్ష అని అన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు ఎమ్మెల్యే మట్టరాగమయి దయానంద్ వెంట సత్తుపల్లి నియోజకవర్గం, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు , అధికారులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *