సోలార్ విద్యుత్ ప్లాంట్ ను సందర్శించిన సింగరేణి రక్షణ తనిఖీ బృందం
సోలార్ విద్యుత్ ప్లాంట్ ను సందర్శించిన సింగరేణి రక్షణ తనిఖీ బృందం
మణుగూరు, శోధన న్యూస్ : సింగరేణి 54వ రక్షణ వారోత్సవాల్లో భాగంగా మణుగూరు ఏరియాలోని 30మెగావాట్ల సింగరేణి సోలార్ విద్యుత్ ప్లాంట్ ను జీఎం(ఈఅండ్ఎం), డబ్ల్యూఎస్అండ్ ఈఎం పి జేసురత్నం పిట్జ్ గెరాల్డ్ ఏరియా జీఎం దుర్గం రామచందర్ కలిసి శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా జీఎం(ఈఅండ్ఎం) జేసురత్నం పిట్జ్ గెరాల్డ్ మాట్లాడుతూ.. సింగరేణి సంస్థ పొదుపు చర్యల్లో భాగంగా ఖాళీ ప్రదేశాల్లో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్లాంట్ల వలన విద్యుత్ ఖర్చులను చాలా వరకు తగ్గించుకోవచ్చన్నారు. సంస్థ పురోభివృద్దిలో సోలార్ పవర్ ప్లాంట్లు ఎంతో కీలకంగా వ్యవహరిస్తున్నాయన్నారు. సోలార్ విద్యుత్ ప్లాంట్ ఉత్పాదన సమర్ధవంతంగా జరిగేలా ఉద్యోగులందరూ నిబద్దతతో పని చేస్తూ.. ప్రమాదాలకు తావు లేకుండా అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఇంజనీర్ నర్సిరెడ్డి, అధికారులు కె చంద్రలింగం, సాజీవ్ కుమార్, ఎన్ మధుసూధన్, శోభన్, విజయ్ పాల్, రాజిరెడ్డి, రవి, బి శ్యామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.