తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

స్కానింగ్ సెంటర్ల తనిఖీలు చేపట్టాలి  -జిల్లా వైద్య , ఆరోగ్య శాఖ అధికారిని  శిరీష 

స్కానింగ్ సెంటర్ల తనిఖీలు చేపట్టాలి 

-జిల్లా వైద్య , ఆరోగ్య శాఖ అధికారిని  శిరీష 

భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్ :  భద్రాద్రి కొత్తగూడెం ఐడిఓసి కార్యాలయం జిల్లా వైద్య వైద్య జిల్లా మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో జిల్లా వైద్య , ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ జె వి ఎల్ శిరీష  ఆధ్వర్యంలో… పిసిపి ఎన్ డి టి జిల్లా అడ్వైజరీ కమిటీ సమావేశాన్ని  నిర్వహించారు.  జిల్లా అడ్వైజరీ కమిటీ లో  ఆరు కొత్తగా నియమించిన స్కానింగ్ సెంటర్లు, నాలుగు రినివల్స్ కు అనుమతి ఇవ్వడంపై తీర్మానం చేయడం జరిగింది.  అదేవిధంగా జిల్లా వైద్యాధికారి మాట్లాడుతూ… జిల్లాలో ఎక్కడైతే అబార్షన్ రేటు, ఆడపిల్లల సంఖ్య తక్కువగా ఉన్న ఏరియాలలో నిర్వహిస్తున్న స్కానింగ్ సెంటర్లను తనిఖీ చేయవలెనని, మరియు ఆయా ప్రాంతాలలో అవగాహన కార్యక్రమంలో నిర్వహించాలని తెలిపారు.  లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించిన స్కానింగ్ సెంటర్లపై నిఘా ఉంచి వారికి చట్టపరమైన చర్యలు తీసుకొనున్నట్లు తెలిపారు.  ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు డాక్టర్ ముక్కంటేశ్వర  , డాక్టర్ చైతన్య , డాక్టర్ కోరా శ్రీ, డాక్టర్ అనూష, డాక్టర్ నరేందర్  ,డి పి ఆర్ ఓ శ్రీనివాస రావు  ,డిప్యూటీ డెమో ఎండి ఫయాజ్ మోయుద్దిన్ ,నాగలక్ష్మి  ,బేబీ  పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *