స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు సమర్థవంతంగా నిర్వహించాలి -ఎస్ఎంఓ శ్రీధర్ ఆచార్యులు
స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు సమర్థవంతంగా నిర్వహించాలి
-ఎస్ఎంఓ శ్రీధర్ ఆచార్యులు
మణుగూరు, శోధన న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సబ్ డివిజన్ లోని పినపాక అశ్వాపురం మణుగూరు మండలాల్లో రాష్ట్ర మానిటరింగ్ అధికారి, సమగ్ర శిక్ష ఎస్ సి ఆర్ టి హైదరాబాద్ శ్రీధరాచార్యులు పర్యటించారు తొలుత పినపాక మండలంలోని గాండ్ల బయ్యారం ప్రాథమిక పాఠశాలను సందర్శించి ఉపాధ్యాయుల పాఠ్య బోధన తీరును పరిశీలించారు అనంతరం విద్యార్థులతో మాట్లాడారు వారు అభ్యాసం చేసిన అంశాలను తనిఖీ చేశారు అనంతరం మణుగూరు మండలంలోని జడ్పీ కో ఎడ్యుకేషన్ పాఠశాలను సందర్శించారు 8వ తరగతి గదికి వెళ్లి గణిత పాఠ్య బోధన తీరును పరిశీలించి ఉపాధ్యాయులతో సమీక్షించారు ఉన్నతి కార్యక్రమం యొక్క ప్రాధాన్యతను ఉపాధ్యాయులకు సూచించారు పాఠ్యపుస్తకానికి పీరియడ్ ప్లాన్లకు అభ్యసన సాధన పుస్తకాలకు ఉన్న సంబంధాన్ని తెలిపారు మూడింటిని కోఆర్డినేట్ చేసుకున్నప్పుడే తరగతి గది ఆదర్శవంతంగా ఉంటుందన్నారు పిల్లవాడు స్థాయి కూడా మెరుగుపడుతుందన్నారు అనంతరం జగ్గారం అశ్వాపురం మండలంలో ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించారు రెండో తరగతి ఆరవ తరగతి పాఠ్య బోధన ను పరిశీలించారు అనంతరం ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు స్టేట్ మానిటరింగ్ ఆఫీసర్ వెంట ఎస్ ఆర్ జి శ్రీనివాసరెడ్డి ఎంఈఓ వీరస్వామి డిఆర్సిలు కోటేశ్వరరావు రవికుమార్ ఎంఎంవోలు మండల నోడల్ ఆఫీసర్ కొమరం నాగయ్య జి నాగశ్రీ భాస్కర సూరి,గర్ల్స్ హైస్కూల్ హెచ్ఎమ్ఎన్ఓ సువర్ణ జ్యోతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.