స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రతీక్ జైన్
స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి
మణుగూరు, శోధన న్యూస్ : పినపాక అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన ఈవిఎం స్ట్రాంగ్ రూమ్ ను నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, భద్రాచలం ఐటిడిఏ పిఓ ప్రతీక్ జైన్ శుక్రవారం సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పినపాక నియోజకవర్గం పరిధిలో 241 పోలింగ్ కేంద్రాలలో అన్ని వసతులు ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ నెల 30, 31 తేదీల్లో పోలింగ్ సిబ్బందికి మొదటి విడత శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు చేయాలని, ఎలాంటి ఇబ్బందులకు తావు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి వి రాఘవరెడ్డి, పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు.