హరిప్రియ నాయక్ నామినేషన్ కు భారీగా తరలి రావాలి
హరిప్రియ నాయక్ నామినేషన్ కు భారీగా తరలి రావాలి
కామేపల్లి, శోధన న్యూస్ :మండల పరిధిలోని గ్రామాల నుండి నేడు ఇల్లెందు లో జరిగే ఇల్లందు నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి బానోత్ హరిప్రియనాయక్ నామినేషన్ కార్యక్రమానికి భారీగా తరలిరావాలని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ధనియాకుల హనుమంతరావు కోరారు.మండల పరిధిలోని కొత్త లింగాల గ్రామంలో పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ. కామేపల్లి మండలంలో ఎమ్మెల్యే హరిప్రియ ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని పేర్కొన్నారు. గతంలో ఎన్నడ జరగని అభివృద్ధి హరిప్రియ ఆధ్వర్యంలో జరిగాయని అన్నారు. ప్రతి గ్రామంలో సిసి రహదారి నిర్మాణం చేపట్టిన ఘనత ఎమ్మెల్యే హరిప్రియనాయక్ కే దక్కుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ కారు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యకర్తలు భారీగా తరలి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించాలని కోరారు.ఈ కార్యక్రమంలో నాయకులు అంతోటి అచ్చయ్య,మల్లెంపాటీ శ్రీనివాసరావు,సామ మోహన్ రెడ్డి,కే లోతు భాస్కర్ నాయక్ ,విష్ణువర్ధన్ రెడ్డి, కృష్ణారెడ్డి, కృష్ణ ప్రసాద్,బట్టు శంకర్ ,కాట్రాల రాంబాబు, యడ్లపల్లి శేషగిరిరావు, సర్పంచ్ భగవాన్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.