హరిహర క్షేత్రంలో అంగరంగ వైభవంగా మహా పడిపూజ
హరిహర క్షేత్రంలో అంగరంగ వైభవంగా మహా పడిపూజ
-పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి
ఇల్లందు, శోధన న్యూస్ : ఇల్లందు నియోక్జకవర్గం జెకె ఏరియాలోని హరిహర క్షేత్రంలో ఆదివారం మహా పడిపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రకాల రకాల పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అయ్యప్ప భక్తుల కోలాహలం తో హరిహర క్షేత్రం కిటకిటలాడింది. అయ్యప్ప భక్తుల నామస్మరణంతో హరిహర క్షేత్రం మార్మోగింది. అయ్యప్ప భక్తుల విశేష పూజల కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఆలయ కమిటీ చైర్మన్ కృష్ణ పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మునిసిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో ఆయనను సత్కరించారు. కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు కొప్పురావూరి భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.