హైదరాబాద్ పరిస్థితులు మారాయి
హైదరాబాద్ పరిస్థితులు మారాయి
-మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
హైదరాబాద్, శోధన న్యూస్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత వివిధ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చిన స్థిరపడిన ప్రజల్లో భయాందోళనలు తొలగిపోయాయని బిఆర్ఎస్ సనత్ నగర్ నియోజకవర్గ అభ్యర్థి, రాష్ట్ర మంత్రి తలసాన శ్రీనివాస్ యాదవ్ అన్నారు.అమీర్‌పేట డివిజనులోని ఆదిత్య హోటల్లో సనత్ నగర్ నియోజకవర్గ మర్చంట్స్ అసోసియేషన్,వివిధ పరిశ్రమల నిర్వాహకుల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య ఆహ్వానితులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటున్న వారికి ధైర్యం వచ్చిందన్నారు. అపోహలు, అనుమానాలు తొలగిపోయాయని వివరించారు. వ్యాపారులకు, పరిశ్రమల నిర్వాహకులకు అన్ని సహాయ సహకారాలు ప్రభుత్వం అందిస్తోందని చెప్పుకొచ్చారు.సనత నగర్ నియోజకవర్గంలో గత 50 సంవత్సరాలలో జరగని అభివృద్ధిని కేవలం 9 సంవత్సరాల్లో చేసి చూపించామన్నారు. అనంతరం సమావేశంలో పాల్గొన్న రాజస్తాన్ సమాజ్, గుజరాతి, అగర్వాల్, జైన్, రాజ్ పురోహిత్ సమాజ్ లకు చెందిన పలువురు ప్రతినిధులు మాట్లాడుతూ తలసాని శ్రీనివాస్ యాదవ్ కు అండగా ఉంటామని పేర్కొన్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం సహకరించిన విధానాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్బంగా మంత్రిని ఆయా సమాజ్ లకు చెందిన ప్రతినిధులు ఘనంగా సత్కరించారు.