తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్  పక్కా… ప్రభుత్వ విప్  రేగా కాంతారావు 

హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్  పక్కా…

  • అభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శం..!
  • బిఆర్ఎస్ తోనే పినపాక నియోజకవర్గం అభివృద్ధి
  • సీఎం కేసీఆర్  హయాంలోనే అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు
  • ప్రజలంతా బిఆర్ఎస్ వైపే… గడపగడపకు పథకాలు అందించిన ఘనత బిఆర్ఎస్ ప్రభుత్వానిదే
  •  ప్రభుత్వ విప్  రేగా కాంతారావు 

పినపాక, శోధన న్యూస్ :  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని పలు గ్రామాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ  అధ్యక్షులు, పినపాక ఎమ్మెల్యే  రేగా కాంతారావు  గోవిందాపురం,తోగ్గుడెం, గోపాల్ రావు పేట, పినపాక ,గడ్డంపల్లి, నారాయణపురం, బోటి గూడెం, బందగిరి నగరం, మడతన కుంట, సీతంపేట, ఉప్పాక, పెంటన్నగూడెం, బొమ్మరాజు పల్లి, ఏడుళ్ల బయ్యారం, ఎల్చి రెడ్డిపల్లి, పాత రెడ్డిపాలెం, గ్రామాలలో పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాలలో వారికి పూల వర్షంతో ఘన స్వాగతాలు పలికారు. పలు ఆలయాలలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా  ప్రభుత్వ విప్  రేగా కాంతారావు  మాట్లాడుతూ..బిఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టో తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్  ఇచ్చిన భరోసాని ఆయన అన్నారు సీఎం కేసీఆర్నా యకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అన్నారు. దేశంలో ఇంటింటికి మంచినీళ్లు, ఉచిత విద్యుత్, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, రైతుబంధు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర మాత్రమే అన్నారు.తాజాగా ఎన్నికల మ్యానిఫెస్టో తో ప్రతిపక్షాల దిమ్మ తిరిగిపోయింది అన్నారు. దేశం మెచ్చిన పథకాలను సీఎం కేసీఆర్  ప్రవేశపెట్టి నెంబర్ వన్ స్థానంలో తెలంగాణను నిలబెట్టినట్లు ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత విధానాలతో ప్రజలను మభ్యపెట్టే మాయమాటలతో గ్రామాలకు వస్తున్నారని అన్నారు. బిఆర్ఎస్ తోనే ప్రజల సంక్షేమ అని అన్నారు. ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం బిఆర్ఎస్ పార్టీ ఎంతో గాను కృషి చేస్తున్నదని అన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపారని ఆయన అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా పథకాలను అమలు చేస్తూ ప్రతి కుటుంబానికి అండగా ఉంటున్నారని పేర్కొన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలతో పేదల జీవితాలలో వెలుగులు నిండయని అన్నారు. సీఎం కేసీఆర్  సహకారంతో పినపాక నియోజకవర్గం రూపురేఖలు మారిపోయాయని అన్నారు. అభివృద్ధి కోసం ప్రజలు బిఆర్ఎస్ కు ఓటు వేసి మరో మారు సీఎం కేసీఆర్ ని ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. అదేవిధంగా నియోజకవర్గ అభివృద్ధి కోసం తనను గెలిపించాలని మరింత అభివృద్ధి చేస్తానని ప్రజలకు తెలిపారు. రైతుల సంక్షేమానికి సీఎం కేసీఆర్  కృషి చేస్తున్నారని, రైతు బంధు ఎకరానికి మొదటి ఏడాది 12 వేల నుంచి ఐదు సంవత్సరాల కాలంలో 16 వేలకు పెంచి ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారని ఆయన అన్నారు. రైతు బీమా పథకం ద్వారా లక్ష మందికి పైగా రైతులు లబ్ధి పొందాలని 73 వేల కోట్లు రైతు బంధు పథకం ద్వారా అందిస్తున్నారన్నారు. రాష్ట్రంలో మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి సాధించేందుకు పలు పథకాలను సీఎం కేసీఆర్  ప్రవేశపెట్టారని ఆయన పేర్కొన్నారు. సౌభాగ్య లక్ష్మి పథకంతో పేద మహిళలకు 3000 గౌరవ భృతి ఇచ్చేందుకు మ్యానిఫెస్టో లో పేర్కొన్నారని దేశంలో ఎక్కడలేని విధంగా మహిళలకు రాజకీయ అవకాశాలు కల్పించాలని గుర్తు చేశారు స్వయం శక్తి గ్రూపులకు సొంత భవనాలు నిర్మించేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణకు సీఎం కేసీఆర్   కృషి చేస్తున్నారని రాష్ట్రవ్యాప్తంగా అత్యుధునిక వైద్యశాలలను ఏర్పాటు చేయడంతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశారన్నారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించినందుకు బస్తీ దవాఖానాలు ఏర్పాటుచేసి సౌకర్యాలు కల్పించారని, ఇప్పటివరకు పది లక్షల ఉన్న ఆరోగ్య బీమా గరిష్ట పరిమితిని కేసీఆర్ ఆరోగ్య రక్ష పథకంతో 15 లక్షలకు పెంచి మ్యానిఫెస్టోలో పెట్టారన్నారు అదేవిధంగా తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి 5 లక్షల జీవిత బీమా కల్పించేందుకు సీఎం కేసీఆర్ గారు చర్యలు తీసుకున్నార అన్నారు. ఆసరా పెన్షన్ తో అర్హులైన వారికి చేతన అందించేందుకు సీఎం కేసీఆర్  కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు 3000 ఉన్న పెన్షన్ ప్రతి సంవత్సరం పెంచుతూ 5000 ఇచ్చినందుకు చర్యలు తీసుకున్నారన్నారు. అదేవిధంగా దివ్యంగులకు పెన్షన్ ఇటీవల నాలుగు వేలకు పెంచారని అని తెలిపారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రేషన్ పై ఉన్న బియ్యం అందించినందుకు అన్నపూర్ణ పథకం మ్యానిఫెస్టో తో సీఎం కేసీఆర్  శ్రీకారం చుట్టారని దీంతో 93 లక్షల పేద కుటుంబాలకు లబ్ధి చేకూరనున్నదన్నారు. అదేవిధంగా 400కే వంట గ్యాస్ అందించేందుకు సీఎం కేసీఆర్  చర్యలు తీసుకున్నారు అని తెలిపారు. అదే విధంగా అగ్రవర్ణ పేదలకు గురుకులాల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *